కీరవాణి వల్ల పవన్ కళ్యాణ్ సినిమాపై పెరిగిన క్రేజ్

Pawan Kalyans Movie has Increased Craze due to MM Keeravani
x

కీరవాణి వల్ల పవన్ కళ్యాణ్ సినిమాపై పెరిగిన క్రేజ్

Highlights

కీరవాణి వల్ల పవన్ కళ్యాణ్ సినిమాపై పెరిగిన క్రేజ్

Hari Hara Veera Mallu: రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా కంటెంట్ తో సంబంధం లేకుండా మొదటి రోజే రికార్డులు సృష్టించగల సత్తా ఉన్న హీరోలలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. అయితే పవన్ కళ్యాణ్ క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగానే ఉంటుంది కానీ నార్త్ లో మాత్రం అంతగా కనిపించదు. చాలావరకు పవన్ కళ్యాణ్ చేసినవి రీమిక్స్ సినిమాలు కావడంతో హిందీలో ఇంకా పవన్ కళ్యాణ్ కి అంత మంచి క్రేజ్ దక్కలేదు.

కానీ తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న "హరిహర వీరమల్లు" సినిమా పై మాత్రం అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక హిందీలో కూడా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే హిందీ ప్రేక్షకులు కూడా సినిమా కోసం ఎదురు చూడడానికి కారణం పవన్ కళ్యాణ్ కాదు ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్న ఎంఎం కీరవాణి.

బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో కీరవాణి పేరు ప్రపంచమంతా మారుమ్రోగి పోతోంది. ముఖ్యంగా "నాటు నాటు" పాటతో కీరవాణి క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగింది. దీంతో "హరిహర వీర మల్లు" సినిమాపై కూడా హిందీ ప్రేక్షకుల కన్ను పడడంతో చిత్ర నిర్మాత ఏం రత్నం సినిమాని హిందీలో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నాటు నాటు పాటకి ఆస్కార్ కనుక వస్తే ఇక కీరవాణి చేసే ప్రతి సినిమాకి ప్యాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు వస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు.

Show Full Article
Print Article
Next Story
More Stories