Pawan Kalyan: డైరెక్టర్ గా మరొకసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: మరొకసారి యాక్షన్ డైరెక్టర్ గా మారిన పవర్ స్టార్

Dhatripriya
Published on: 31 Dec 2022 9:46 AM IST
Pawan Kalyan Will Try His Luck As A Director Again
X

Pawan Kalyan: డైరెక్టర్ గా మరొకసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా కథకుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్ గా, గాయకుడిగా, కూడా ఎందరో అభిమానులను ఏర్పరుచుకున్న పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా మారారు. చిరంజీవి హీరోగా నటించిన "డాడీ" సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక ఫైట్ సీక్వెన్స్ కి దర్శకుడిగా గా పనిచేశారు.

ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అయితే తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరొక యాక్షన్ ఎపిసోడ్ కి దర్శకత్వం వహించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో త్వరలోనే "హరిహర వీరమల్లు" అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఏం రత్నం ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉండబోతుందట. ఈ మధ్యనే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. కేవలం ఈ ఒక్క యాక్షన్ సీన్ కోసం చిత్ర బృందం దాదాపు 40 రోజుల పాటు కష్టపడిందని సమాచారం. ఈ సీక్వెన్స్ మొత్తం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిందట.

ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఒక కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ ఇది. దాదాపు 15 నిమిషాల పాటు సాగే ఈ ఎపిసోడ్ మొత్తానికి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించారట. ఆ నిర్మాత ఏం రత్నం కూడా ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం భారీగానే ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ సీన్ తో పాటు క్లైమాక్స్ కి ముందు వచ్చే ఫైట్ సీన్ కూడా సినిమాకి హైలైట్లుగా నిలవబోతున్నాయని చిత్ర బృందం చెబుతోంది.

Dhatripriya

Dhatripriya

Next Story