మెగా హీరో కోసం షూటింగ్ మొదలు పెట్టనున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: రీమేక్ సినిమా మొదలుపెట్టబోతున్న పవర్ స్టార్

Jyothi
Updated on: 18 Jan 2023 7:00 AM IST
Pawan Kalyan will Start Shooting for Mega Hero
X

మెగా హీరో కోసం షూటింగ్ మొదలు పెట్టనున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: "భీమ్లా నాయక్" సినిమాతో మంచి హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు సినిమా చేస్తారా అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. మరోవైపు రాజకీయ పనులతో కూడా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రముఖ కోలీవుడ్ నటుడు సముతిరఖని దర్శకత్వంలో ఒక సినిమాని ఒప్పుకున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన "వినోదయసితం" సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు.

మెగా హీరో సాయి తేజ్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. పవన్ కళ్యాణ్ మరియు సాయి తేజ్ కాంబినేషన్లో సినిమా కాబట్టి మెగా అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి కానీ సినిమా షూటింగ్ మాత్రం మొదలవలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈనెల 27వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ పట్టలెక్కబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ కూడా సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. చాలావరకు పవన్ కళ్యాణ్ సన్నివేశాలన్నీ సినిమా మొదటి షెడ్యూల్ లోనే పూర్తి చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సాయి తేజ్ కూడా 2021లో రిపబ్లిక్ సినిమా తర్వాత మళ్లీ ఏ సినిమాని విడుదల చేయలేదు. ఇక "వినొదయ సితం" రీమేక్ కాకుండా సాయి ధరంతేజ్ "విరూపాక్ష" అనే సినిమాతో కూడా బిజీ గా ఉన్నారు.

Jyothi

Jyothi

Next Story