Pawan Kalyan: "హరిహర వీర మల్లు" షూటింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

Pawan Kalyan: "హరిహర వీర మల్లు" షూటింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

Rama Rao
Published on: 4 Nov 2022 2:38 PM IST
Pawan Kalyan Will Start Shooting For Hari Hara Veera Mallu Film | Tollywood News
X

Pawan Kalyan: "హరిహర వీర మల్లు" షూటింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్నాళ్లపాటు సినిమాలకి దూరంగా ఉండి ఈ మధ్యనే "వకీల్ సాబ్" సినిమాతో మళ్ళీ ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పటినుంచి పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో కొంత స్లో అయ్యారని చెప్పుకోవచ్చు. "వకీల్ సాబ్" తర్వాత పవన్ కళ్యాణ్ కేవలం "భీమ్లా నాయక్" సినిమాలో మాత్రమే కనిపించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో మొదటిది "హరిహర వీరమల్లు".

క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఎప్పటికప్పుడు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయ పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాని బాగా వాయిదా వేశారు. అయితే సినిమా షూటింగ్ వాయిదా పడుతూ రావడంతో నిర్మాతకి వడ్డీలు కట్టుకోవడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు చిత్ర నిర్మాత కోసం ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.

సినిమా షూటింగ్ ను అతి త్వరలోనే పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. రాజకీయ పనులలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సినిమా కోసం చిన్న చిన్న గ్యాప్స్ మాత్రమే తీసుకుంటూ త్వరలోనే సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు ఎన్నికల సమయం కూడా దగ్గర పడుతుండడంతో పవన్ కళ్యాణ్ కు అటు రాజకీయ పనులు కూడా ఎక్కువైపోయాయి.

Rama Rao

Rama Rao

Next Story