Pawan Kalyan: "ఓజీ" సినిమా కోసం పుణె వెళ్ళనున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పూణేకి పయనమవ్వనున్న పవన్ కళ్యాణ్

Jyothi
Published on: 26 April 2023 4:03 PM IST
Pawan Kalyan Will go to Pune for the Movie OG
X

Pawan Kalyan: "ఓజీ" సినిమా కోసం పుణె వెళ్ళనున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో "ఉస్తాద్ భగత్ సింగ్" మరియు "సాహో" ఫేమ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో "ఓజీ" సినిమా షూటింగులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమాకి సంబంధించిన ఒక కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ని పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు "ఓజీ" సినిమా షూటింగ్ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ముంబై లో ఒక గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర షూటింగ్ ముంబైలో జరిగింది.

సుజిత్ దర్శకత్వం విషయంలో పవన్ కళ్యాణ్ చాలా సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం వారం పాటు జరిగిన ముంబై షూటింగ్ షెడ్యూల్ ఇప్పుడు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక తర్వాత షూటింగ్ షెడ్యూల్ కోసం చిత్ర బృందం పూణేకి వెళ్లబోతోంది. మే మొదటి వారం దాకా ఈ షూటింగ్ షెడ్యూల్ జరగబోతోంది.

సినిమాకి సంబంధించిన కీలక నటీ నటులు అందరూ ఈ షూటింగ్ షెడ్యూల్లో పాల్గొనబోతున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ పతాకం పై డివివి దానయ్య ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తెలుగులో మాత్రమే కాక ఈ సినిమా హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కి సిద్ధమవుతోంది. ఆరు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి నిర్మాణాంతర పనులు కూడా పూర్తిచేసి సంవత్సరం ఆఖరి కల్లా సినిమాని విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

Jyothi

Jyothi

Next Story