Mahesh Babu - Pawan Kalyan: మహేష్ బాబు ఇంట పవన్ కళ్యాణ్ బహుమతి

Mahesh Babu - Pawan Kalyan: మహేష్ బాబుకి క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

admin1
Published on: 25 Dec 2021 2:22 PM IST
Pawan Kalyan Wife Anna Lezhneva Christmas 2021 Gift to Mahesh Babu Wife Namrata Shirodkar | Tollywood News Online
X

Mahesh Babu - Pawan Kalyan: మహేష్ బాబు ఇంట పవన్ కళ్యాణ్ బహుమతి

Mahesh Babu - Pawan Kalyan: ఆతిథ్యం ఇవ్వడంలో మెగాఫ్యామిలీ పేరు ముందే ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన తోట లో పండే మామిడి కాయలను చాలామంది సెలబ్రిటీలకు పంచుతూ ఉంటారు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటికీ ఒక గిఫ్ట్ నీ పంపారు. ఆనా మరియు కళ్యాణ్ నుంచి అని ఆ గిఫ్ట్ పై వ్రాసి ఉంది. దీంతో నమ్రత పవన్ కళ్యాణ్ మరియు ఆయన భార్య కు కృతజ్ఞతలు తెలిపింది.

మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు స్టార్ హీరోలు. వారికి ఉన్న క్రేజ్ చాలా ఎక్కువ. నిజానికి వీరిద్దరి మధ్య వైరం ఎక్కువగా ఉంటుందని శత్రుత్వం కూడా ఉందని కొంత మంది అంటూ ఉంటారు. కానీ వారిద్దరి మధ్య మంచి స్నేహం తప్ప మరి ఏమీ లేదు అని పవన్ కళ్యాణ్ క్రిస్టమస్ సందర్భంగా మహేష్ కి గిఫ్ట్ పంపి నిరూపించారు.

మహేష్ బాబు మాత్రమే కాక పలు సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ నుంచి మంచి గిఫ్టులు అందుకున్నారు. ఒక వైపు పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్" సినిమాతో బిజీగా ఉండగా మరొక వైపు మహేష్ బాబు "సర్కారు వారి పాట" సినిమా తో బిజీగా ఉన్నారు.

admin1

admin1

Next Story