Vakeel Saab Trailer: మేమైతే అబ్బాయిలను అడగొద్దా.. ఇదే న్యాయం నందాజీ!

Vakeel Saab Trailer: పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చేస్తున్న క్షణం వచ్చేసింది. వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజైంది.

Venkata Chari
Updated on: 29 March 2021 6:25 PM IST
Pawan Kalyan Vakeel Saab Trailer Released
X

వకీల్ సాబ్ ట్రైలర్

Vakeel Saab Trailer: పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చేస్తున్న క్షణం వచ్చేసింది. హోళీ సందర్భంగా సాయంత్రం 6 గంటలకు వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజైంది. యూట్యాూబ్ లో రికార్డుల మోత మోగనుందని అభిమానులు హోరెత్తిపోతున్నారు. ట్రైలర్ రిలీజ్ కు ముందే సోషల్ మీడియాలో #VakeelSaabTrailerDay అనే హ్యాస్ ట్యాగ్ తో ట్రెండ్ క్రియోట్ చేశారు పవన్ ఫ్యాన్స్.

ఇక ట్రైలర్ విషయానికొస్తే... పల్లవి(నివేదా థామస్) ఆర్ యూ వర్జిన్ (Are You Virgin).. అంటూ ప్రకాశ్ రాజ్ డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. పవర్ స్టార్ తన మాటలతోనే ట్రైలర్ టెంపో పెంచేశాడు. "ఇలాంటి అమ్మాయిలకు ఇలానే జరిగిద్దని" అని బోనులో ఉండే వ్యక్తి అంటే... ఇలా జరొగొద్దు.. ఇలా జరగకూడదు అంటూ పవన్ కోర్టులో వాదించడం అదిరిపోయింది. అలానే ఆర్ యూ వర్జిన్ అంటూ బోనులో నిల్చున్న మగవాడిని అడగడంతో.. ప్రకాశ్ రాజ్ అబ్‌జగ్సన్ యువర్ ఆనర్ అంటూ అడ్డుపడితే... మీరు అమ్మాయిలనైతే అడొగొచ్చు.. మేం అబ్బాయిలను అడక్కూడదా.. ఇదేం న్యాయం నందాజీ అని చెప్నే డైలాగా ఆకట్టుకుంది. మొత్తానికి ట్రైలర్ తో ఆకట్టుకుంది వకీల్ సాబ్ టీం. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

వేణు శ్రీరామ్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్‌లో విజయం సాధించిన పింక్‌ సినిమాను తెలుగులో వకీల్‌సాబ్‌గా రీమేక్‌గా చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను 'వకీల్ సాబ్'లో పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. దీంతో ఈ సినిమాకు భారీ హైప్ క్రియెట్‌ అయ్యింది. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్‌గా కాగా, అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story