Pawan Kalyan Vakeel Saab: 'వకీల్ సాబ్' రిలీజ్ డేట్ ఫిక్స్

Samba Siva Rao
Updated on: 30 Jan 2021 8:38 PM IST
Pawan Kalyan Vakeel Saab: వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ఫిక్స్
X

 ‘వకీల్ సాబ్’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సమయం ఎంతో దూరం లేదు. పవన్ సినిమా అప్ డేట్స్ కోసం ఆయన ఫ్యాన్స్ వేయికళ్ళతో నిరీక్షిస్తున్నారు. పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చేసింది.

పవన్ కళ్యాణ్ మూడు సంవత్సారాల తర్వాత 'వకీల్ సాబ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. ఏప్రియల్ 9న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో రాబోతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సమయం ఎంతో దూరం లేదు. పవన్ సినిమా అప్ డేట్స్ కోసం ఆయన ఫ్యాన్స్ వేయికళ్ళతో నిరీక్షిస్తున్నారు. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది.

పవన్ కళ్యాణ్ మూడు సంవత్సారాల తర్వాత 'వకీల్ సాబ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. ఏప్రియల్ 9న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ , టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం విడుదల తేదీకోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఈ విషయాన్నిచిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వకీల్ సాబ్ చిత్రం బాలీవుడ్ మూవీ పింక్ సినిమాకు రీమేక్ గా వస్తుంది. ఈ మూవీకి రామ్ వేణు దర్శకత్వం వహించగా.. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రుతి హాస‌న్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల కీలక పాత్రల్లో నటించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story