Pawan Kalyan : 'వకీల్ సాబ్' ఓటిటి రిలీజ్ డేట్ అప్పుడే

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం మూడేళ్లుగా ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తువచ్చారు.

Samba Siva Rao
Published on: 9 April 2021 4:57 PM IST
Vakeel Saab Movie On OTT
X

వకీల్ సాబ్ ఫైల్ ఫోటో 

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం మూడేళ్లుగా ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తువచ్చారు. పవన్ నుంచి సినిమా లేకపోవడంతో సైలెంటుగా ఉంటూ వచ్చారు ఫ్యాన్స్. 'వకీల్ సాబ్' విడుదల అవడంతో థియేటర్ల వద్ద హంగామా నెలకొంది. మరోవైపు ఏపీలో కరోనా విజృంభిస్తోన్న వేళ హైకోర్టు ఆర్డర్స్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ షోలు బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరించింది. అయితే పవన్ సినిమా వకీల్ సాబ్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.

మరోవైపు సినిమా రిలీజ్ అయిన వెంటనే ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్‌పై విడుదల ఎప్పుడనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ ఓటీటీలో మే29వ తేదీన విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమా శాటిలైట్, ఓటీటీ బిజినెస్ 20 కోట్ల రోపాయలకు జరిగినట్లు తెలుస్తోంది. విడుదలకు ముందే ఈ బిజినెస్ జరిగినట్లు సమాచారం. సినిమా థియేటర్లలో విడుదల అయిన 50 రోజుల తర్వాత అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ చేయాలని ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జీ సినిమాస్ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకుంది. దీనికోసం కూడా 15 కోట్ల వకు పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.

ఈ సినిమా విషయానికి వస్తే..అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన పింక్ సినిమాకు తెలుగులో పవన్ హీరోగా రీమేక్ గా తెరకెక్కింది. దర్శకుడు వేణు శ్రీరామ్ పింక్ సినిమాలోని కథను పవన్ ఇమేజ్‌కు తగ్గట్లుగా పక్కా కమర్షియల్ సినిమాగా రూపొందించాడు. పవన్ కు జోడీగా శృతిహాసన్ నటించగా, ప్రకాష్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story