Pawan Kalyan: 'వకీల్ సాబ్'కు ఊహించని షాక్ తప్పదా?

Pawan Kalyan: సినిమా ప్రకటిస్తే చాలు ఫ్యాన్స్ అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Samba Siva Rao
Published on: 3 April 2021 5:09 PM IST
Vakeel Saab Movie Release April 9th
X

వకీల్ సాబ్ (ఫైల్ ఫోటో) 

Pawan Kalyan: పవర్ స్టార్ సినిమా ప్రకటిస్తే చాలు ఫ్యాన్స్ అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు తాజాగా వకీల్ సాబ్ సినిమాపై కూడా ఈ స్థాయి అంచనాలే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూడేళ్ళ తర్వాత వస్తున్న సినిమా కావడం ఒక ఎత్తైయితే. హిందీలో విజయవంతమైన పింక్ రీమేక్ కావడం మరో ఎత్తు. ఈ నేపథ్యంలో పవన్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను ఏప్రిల్ 9న విడుదల చేయడాని రంగం సిద్దమైంది.

ఇదిలా ఉంటే ఉగాది సందర్బంగా విడుదల అవుతున్న ఈ సినిమాకి ఫస్ట్ డే నుంచే ఆడియన్స్ థియేర్లవైపు పరుగులు తీసే అవకాశం ఉంది. ఓపెనింగ్స్ కూడా భారీ ఓపెనింగ్స్ రావచ్చు. వకీల్ సాబ్ రికార్డులు తిరగరాయడం ఖాయం అని అర్థమైపోయింది. అయితే ఇప్పుడు వకీల్ సాబ్ కచ్చితంగా ఊహించని ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తుందిప్పుడు. నిజానికి 2020 మే 15నే విడుదల కావాల్సింది వకీల్ సాబ్. కానీ కరోనా కారణంగా ఇన్నాళ్లు వాయిదా పడింది. అయితే ఇన్ని రోజులు అయినా కూడా కరోనా ఇప్పటికీ వకీల్ సాబ్‌ను వదిలేలా కనిపించడం లేదు. మొన్నటి వరకూ పరిస్థితి బాగానే ఉంది.. థియేటర్లు తెరుచుకోవడంతో ప్రేక్షకులు కూడా పండగ చేసుకుంటున్నారు.

అయితే ఇప్పుడు కరోనా కేసులు భారీగా పెరిగిపోవడంతో మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇప్పుడు కేసులు భారీగా పెరుగుతున్నాయి. దాంతో చాలా చోట్ల లాక్ డౌన్ పెట్టేలా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సినిమా విడుదలైతే వచ్చే అభిమానులను కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. కరోనా చెయ్యి దాటిపోయే ప్రమాదం ఉందని భావించి.. 50 శాతం ఆకుపెన్సీతోనే థియేటర్లను నడిపించాలని ప్రభుత్వానికి వైద్య శాఖ అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారని తెలుస్తుంది.

కర్ణాటకలో 50 శాతం ఆకుపెన్సీతోనే థియేటర్లను నడిపించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే వకీల్ సాబ్ కు కష్టాలు తప్పేలా లేదు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, బోణి కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగెళ్ళ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story