Vakeel Saab: త్వరలో బుల్లితెరపై "వకీల్ సాబ్"

Pawan Kalyan Vakeel Saab Movie Telecast in Television Soon
x

వకీల్ సాబ్ పోస్టర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Vakeel Saab: హిందీ "పింక్" చిత్రాన్ని తెలుగు రీమేక్ "వకీల్ సాబ్" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్

Vakeel Saab: హిందీ పింక్ చిత్రాన్ని తెలుగు రీమేక్ "వకీల్ సాబ్" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ సినిమా సూపర్ హిట్ తో తక్కువ సమయంలోనే మంచి కలెక్షన్లు సాధించాడు. విడుదలైన కొద్ది రోజులకే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదలై తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని జీ మీడియా గ్రూప్ శాటిలైట్ హక్కులను భారీగానే చెల్లించి కొనుగోలు చేసింది. కరోనా కారణంగా సినిమా థియేటర్స్ లో చూడలేకపోయిన అభిమానులకు బుల్లితెరపై ఈ "వకీల్ సాబ్" రానున్నాడు.

దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతి హసన్ హీరోయిన్ గా నటించిగా అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలు పోషించారు. తమన్ అందించిన సంగీతంతో ఈ సినిమాలోని పాటలు మరింత క్రేజ్ సంపాదించాయి. ఇప్పటికే వెండి తెరపై రికార్డులు సృష్టించిన "వకీల్ సాబ్" త్వరలో బుల్లితెరలో టిఆర్పీ రేటింగ్ తో మరెన్ని సంచనాలు సృష్టించబోతుందో వేచి చూడాలి. ఈ సినిమాకి సంబంధించిన వివరాలను జీ మీడియా అధికారికంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories