పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు తీపి కబురు.. వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి..టీజర్ కూడా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు తీపి కబురు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది.

Samba Siva Rao
Published on: 29 Dec 2020 8:29 PM IST
పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు తీపి కబురు.. వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి..టీజర్ కూడా..
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు తీపి కబురు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు బయటికి వచ్చాయి. షూటింగ్ పూర్తైన ఆనందంలో దర్శకుడు వేణు శ్రీరామ్‌ను హత్తుకున్నాడు పవన్. హైదరాబాద్, అరకు లాంటి ప్రదేశాల్లో వకీల్ సాబ్ షూటింగ్ జరిగింది. ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ ఆడిపాడనుంది. ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా రూపొందిస్తున్నారు.

పింక్ సినిమా రీమేక్‌గా తెలుగులో తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం దాదాపు ఏడాదిన్నర సమయం కూడా తీసుకున్నాడు. షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్రబృదం చూస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న వకీల్ సాబ్ టీజర్ విడుదల కానుందని సమాచారం. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది. అజ్ఞాతవాసి సినిమా తర్వత వస్తున్న వకీల్ సాబ్ పై పవన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 100 కోట్లకు పైగానే జరుగుతుంది. పవన్ రీ ఎంట్రీ సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.





Samba Siva Rao

Samba Siva Rao

Next Story