Vakeel Saab Collections: 'వకీల్ సాబ్' ఎంత కలెక్షన్ చేశాడంటే..

Pawan Kalyans Vakeel Saab Movie Latest Box Office Collection Report
x

వకీల్ సాబ్ కలెక్షన్స్

Highlights

Vakeel Saab Collections: పవన్ కళ్యాణ్ మూడేళ్ల తరువాత 'వకీల్ సాబ్' గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Vakeel Saab Collections: పవన్ కళ్యాణ్ మూడేళ్ల తరువాత 'వకీల్ సాబ్' గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిచినట్టేనని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు విడుదలైన సినిమాల్లో పెద్దది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటించారు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్లా ఇతర పాత్రలు పోషించారు. విడుదలైన మూడు రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించింది. దీంతో ఫిల్మ్ యూనిట్ చాలా సంతోషంగా ఉంది. మరింత మంది దృష్టిని ఆకర్షించేందుకు నిర్మాతలు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. అధికారిక కలెక్షన్ వివరాలను ఇవ్వకూడదని నిర్మాతలు నిర్ణయించునుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో రూ. 90 కోట్లకు పైగా వసూలు చేసిందని టాక్ వినిపిస్తోంది. డిస్ట్రిబ్యూటర్ వాటా రూ. 60 కోట్లు. ఈరోజు(సోమవారం) రూ. 100 కోట్ల మార్కును చేరుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం యుఎస్‌ఎలో కూడా బాగానే కలెక్షన్స్ రాబడుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories