Vakeel Saab First Day Collections: వకీల్ సాబ్ డే 1 కలెక్షన్స్ ప్రభంజనం

వకీల్ సాబ్ ఫైల్ ఫోటో
Vakeel Saab First Day Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా కోసం మూడేళ్లుగా ఆయన అభిమానులు ఎ...
Vakeel Saab First Day Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా కోసం మూడేళ్లుగా ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తువచ్చారు. పవన్ నుంచి సినిమా లేకపోవడంతో సైలెంటుగా ఉంటూ వచ్చారు ఫ్యాన్స్. 'వకీల్ సాబ్' విడుదల అవడంతో థియేటర్ల వద్ద హంగామా నెలకొంది. తొలి రోజు వసూళ్ల లెక్కింపులో జాప్యం జరిగింది. దాంతో వివిధ ఏరియాలో టికెట్ రేట్లు ఒక్కో విధంగా ఉన్నాయి. మరోవైపు ఏపీలో కరోనా విజృంభిస్తోన్న వేళ హైకోర్టు ఆర్డర్స్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ షోలు బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరించింది. అయితే పవన్ సినిమా వకీల్ సాబ్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.
ఈ సినిమా విషయానికి వస్తే..అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన పింక్ సినిమాకు తెలుగులో పవన్ హీరోగా రీమేక్ గా తెరకెక్కింది. దర్శకుడు వేణు శ్రీరామ్ పింక్ సినిమాలోని కథను పవన్ ఇమేజ్‌కు తగ్గట్లుగా పక్కా కమర్షియల్ సినిమాగా రూపొందించాడు. పవన్ కు జోడీగా శృతిహాసన్ నటించగా, ప్రకాష్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
అయితే కొన్ని ప్రాంతాల్లో కలెక్షన్ల వివరాలు అందుబాటులోకి వచ్చాయి. ఖమ్మం జిల్లాలో తొలి రోజున 25 షోలు ప్రదర్శించగా.. రికార్డు స్థాయిలో రూ.30 లక్షలకుపైగా వసూళ్లను రాబట్టింది. సీడెడ్‌లో భారీగా వసూళ్లను నమోదు చేసింది. రూ.4.2 కోట్ల షేర్ రాబట్టింది. కృష్ణ జిల్లాలో గ్రాండ్‌గా కలెక్షన్లను రాబట్టింది.రూ.1.90 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. నైజాంలో వకీల్ సాబ్ హవా కొనసాగింది. ఇక్కడ రూ.10 కోట్లకుపైగా ఓపెనింగ్స్ రాబట్టినట్టు సమాచారం. గోదావరి జిల్లాలో రికార్డులు సృష్టిస్తుంది. తొలి రోజున పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.3.10 కోట్ల..ఈస్ట్ గోదావరి జిల్లాలో రూ.3.10 కోట్లు వసూలు చేసింది. అలాగే ఉత్తరాంధ్రలో ఈ చిత్రం రూ.3.8 కోట్లు రాబట్టింది.
ఇక ఓవర్సీస్‌లో ప్రభంజనం సృష్టించింది. పవన్ మూవీ తొలి రోజున 400k డాలర్లను వసూలు చేసింది. ప్రీమియర్లతో కలుపుకొంటే 730k డాలర్లను రాబట్టింది. భారత కరెన్నీలో చూస్తే..రూ.5.5 కోట్లుపై మాటే. మొత్తానికి పవన్ కళ్యాణ్ తొలి రోజు 40 కోట్ల రూపాయలుపైగా సాధించినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా వెలువడలేదు.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
Diabetics: మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఈ జ్యూస్ దివ్యఔషధం..!
21 May 2022 12:00 PM GMTMLC Kavitha: రచ్చబండ కొచ్చే కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి చూపించండి
21 May 2022 11:30 AM GMTSweat: వేసవిలో చెమట ఎక్కువగా పడుతుందా.. ఈ చిట్కాలు పాటించండి..!
21 May 2022 11:00 AM GMTఅఖిలేశ్ యాదవ్‌తో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ
21 May 2022 10:52 AM GMTకేన్స్ లో 'రాకెట్రీ' ప్రివ్యూ..మాధవన్‌పై ఏఆర్ రెహమాన్ ప్రశంసలు
21 May 2022 10:28 AM GMT