Vakeel Saab: 'వకీల్ సాబ్' సెన్సార్ రివ్యూ

Vakeel Saab:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రం ఎప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే

Samba Siva Rao
Updated on: 5 April 2021 6:07 PM IST
vakeel saab sensor review
X

పవన్ కళ్యాణ్ ఫైల్ ఫోటో 

Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రం ఎప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. వేణు శ్రీరామ్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన పింక్ సినిమాకు తెలుగులో పవన్ హీరోగా రీమేక్ గా తెరకెక్కింది.

దర్శకుడు వేణు శ్రీరామ్ పింక్ సినిమాలోని కథను చెడగొట్టకుండా.. పవన్ ఇమేజ్‌కు తగ్గట్లుగా వకీల్ సాబ్‌ను పక్కా కమర్షియల్ సినిమాగా రూపొందించాడు. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న వకీల్ సాబ్. U/A సర్టిఫికేట్ వచ్చింది. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా కాస్త ఎక్కువగానే ఉండబోతుంది. రెండు మూడు యాక్షన్ సీక్వెన్సులు భారీగానే ఉండబోతున్నాయి.

సెన్సార్ రివ్యూ ప్రకారం సినిమాలో పవన్ ఎక్కువ సేపు కనిపించడని తెలుస్తుంది. ఫస్టాఫ్ అంతా అంజలి, అనన్య, నివేదా థామస్ ఎక్కువగా కనిపిస్తారు. పింక్ సినిమాలో ఒక్క ఫైట్ కూడా ఉండదు కానీ 'వకీల్ సాబ్'లో మొత్తం 5 యాక్షన్ సీక్వెన్సులు ఉండబోతున్నట్లు సెన్సార్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ కూడా ఫైట్‌తోనే ఉంటుందని.. ఓ ఇంట్లో రౌడీ చేరి సామాన్లన్నీ విసిరేస్తూ ఉంటాడు.. ఈ క్రమంలో వివేకానందుడి ఫోటో విసిరేస్తున్నప్పుడు ఆ ఫోటోని గాల్లోనే ఓ చేయి వచ్చి పట్టుకుంటుందని.. అది పవన్ కళ్యాణ్ అని తెలుస్తుంది.

కంటెంట్ కూడా బోల్డ్‌గానే ఉండబోతుంది. రెండున్నర గంటల నిడివితో వకీల్ సాబ్ విడుదలవుతుంది. అయితే ఉన్నంత సేపు మాత్రం స్క్రీన్ షేక్ అయిపోతుందని.. కచ్చితంగా పవన్ కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ చిత్రంలో ఇచ్చాడని తెలుస్తుంది. ఆ తర్వాత రౌడీలతో ఫైట్ సీన్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ కూడా అలాగే ఉన్నాయని.. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కోర్టు సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తుంది. ప్రకాశ్ రాజ్, పవన్ కళ్యాణ్ కోర్టులో వాదించే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తుంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story