Vakeel Saab: వకీల్ సాబ్ నుంచి 'కదులు కదులు' సాంగ్ విడుదల

Vakeel Saab: విడుదలకు ముందే వకీల్ సాబ్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తోంది.

Venkata Chari
Published on: 7 April 2021 9:44 PM IST
Pawan Kalyan Vakeel Saab Kadulu Kadulu Kadulu Song Released
X
వకీల్ సాబ్ 'కదులు కదులు' సాంగ్ రిలీజ్ పోస్టర్

Vakeel Saab: విడుదలకు ముందే వకీల్ సాబ్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తోంది. వకీల్ సాబ్ నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా ఫ్యాన్స్ వైరల్‌గా మార్చేస్తున్నారు. తాజాగా వకీల్ సాబ్ నుంచి "కట్లు తెంచుకుని కదులు" అంటూ సాగే సాంగ్ విడుదలైంది.

థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి రిలీజైన సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. లేటెస్ట్ గా కదులు కదులు కదులు అంటూ వచ్చిన ఈ సాంగ్ కూడా అదిరిపోయింది. మహిళా శక్తిని చాటేలా తనకు తాను ఓ సైన్యంగా మారేలా స్పూర్తిదాయకంగా ఈ పాట ఉంది. ఈ పాటని సుద్ధల అశోక్ తేజ రచించగా శ్రీ కృష్ణ, హేమ చంద్ర ఆలపించారు.

ఇప్పటికే సినిమాలో మగువ మగువా సాంగ్ సెన్సేషనల్ అయిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా వచ్చిన కదులు కదులు సాంగ్ కూడా సూపర్ అనిపించుకుంది. మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మొదటి సినిమా కోసం థమన్ అదిరిపోయేలా అవుట్ పుట్ ఇచ్చాడు. సినిమా సాంగ్స్ మాత్రమే కాదు వకీల్ సాబ్ లో థమన్ బ్యాక్ గ్రౌండ్ కూడా సూపర్ అనిపించుకుంటుందని అంటున్నారు. వేణు శ్రీరాం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శృతి హాసన్, నివేదా థామస్, అనన్యా నటించారు.

Venkata Chari

Venkata Chari

Next Story