Pawan Kalyan: మిలిటరీ ఆఫీసర్‌గా పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందనున్న కొత్త చిత్రంలో పవన్ మిలిటరీ ఆఫీసర్‌గా కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది.

Arun Chilukuri
Published on: 20 Nov 2025 2:37 PM IST
Pawan Kalyan: మిలిటరీ ఆఫీసర్‌గా పవన్ కళ్యాణ్..!
X

Pawan Kalyan: మిలిటరీ ఆఫీసర్‌గా పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందనున్న కొత్త చిత్రంలో పవన్ మిలిటరీ ఆఫీసర్‌గా కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. మార్చి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ బజ్‌తో అభిమానుల్లో ఉత్సాహం నిండిపోయింది.

ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ మరోసారి దర్శకుడు సురేందర్ రెడ్డితో కలవబోతున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త చిత్రంలో పవన్ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారనే సమాచారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంటర్వెల్ వరకు ఆ పాత్ర రహస్యంగా ఉంటుందని, సెకండాఫ్‌లో పూర్తి యాక్షన్ మోడ్‌లో పవన్ కనిపించనున్నారని తెలుస్తోంది. వచ్చే మార్చి నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. సినిమాలో మరో హీరో కూడా ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ బజ్‌తో పవన్ అభిమానుల్లో ఆసక్తి మరింత రేగుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story