Aditi Govitrikar: వామ్మో.. తమ్ముడు హీరోయిన్‌ ఇలా మారిందేంటి..? అస్సలు గుర్తుపట్టరు..!

Aditi Govitrikar: పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ మూవీస్‌లో తమ్ముడు ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Nov 2024 12:45 PM IST
Pawan Kalyan Thammudu Movie Fame Aditi Govitrikar Latest Photos
X

Aditi Govitrikar: వామ్మో.. తమ్ముడు హీరోయిన్‌ ఇలా మారిందేంటి..? అస్సలు గుర్తుపట్టరు..!

Aditi Govitrikar: పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ మూవీస్‌లో తమ్ముడు ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా అప్పట్లో కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. పవన్‌ కళ్యాణ్‌ మేనరిజం, మ్యూజిక్‌ సినిమాను విజయతీరాలకు చేర్చింది. 1999లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం నమోదు చేసుకుంది. పవన్‌ కెరీర్‌ను ఈ సినిమా మలుపు తిప్పిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కాగా ఈ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించిన అదితి గోవిత్రికర్ ప్రేక్షకులను మెప్పించింది. లవ్లీ పాత్రలో కనిపించిన ఈ బ్యూటీ అప్పట్లో కుర్రకారును ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఆమె తెలుగులో బిజీ కావడం ఖాయమని చాలా మంది భావించారు. అయితే ఆ తర్వాత ఆశించిన స్థాయిలో మాత్రం రాణించ లేకపోయింది.

కేవలం ఒక సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో నటించిన ఈ బ్యూటీ మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. బాలీవుడ్‌కు చెందిన అదితి తర్వాత అక్కడ కొన్ని సినిమాల్లో నటించింది. ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్న అదితి.. పలు వెబ్ సిరీస్‌లో, టీవీ షోలలో అడపాదడప కనిపించింది. నిజానికి అదితి యాక్టర్‌ అవ్వకముందు డాక్టర్. ఎంబీబీఎస్‌ చేసిన తర్వాత మోడలింగ్‌లో ఎంట్రీ ఇచ్చింది.

ఈ క్రమంలోనే పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ మిసెస్‌ వరల్డ్‌గా కూడా నిలిచింది. అయితే కరోనా తర్వాత పూర్తిగా వైద్యురాలిగా మారింది. ప్రస్తుతం ఫుల్‌ టైం డాక్టర్‌గా సేవలందిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా లేటెస్ట్‌ విషయాలను అభిమానులతో షేర్‌ చేసుకుంటోంది. దీంతో ఆమె ఫొటోలు మరోసారి నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అయితే తమ్ముడు తర్వాత మళ్లీ ఈ బ్యూటీని చూడని ప్రేక్షకులు షాక్‌ అవుతున్నారు. వయసు పెరగడంతో ఈ బ్యూటీ లుక్‌ పూర్తిగా మారిపోయింది. ఇక తన వైవాహిక జీవితం విషయానికొస్తే భర్తకు విడాకులు ఇచ్చి పిల్లలతో కలిసి ఉంటుంది. మొత్తంమీద ఒకప్పుడు కుర్రకారును షేక్‌ చేసిన అదితి గోవిత్రికర్‌ ప్రస్తుతం వైద్యురాలిగా సేవలందిస్తోంది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story