Anil Ravipudi - Pawan Kalyan: అనిల్ రావిపూడికి కండిషన్ పెట్టిన పవన్ కళ్యాణ్

* అలాంటి కథ రెడీ చేయమంటున్న పవన్ కళ్యాణ్

admin1
Updated on: 13 Nov 2021 2:00 PM IST
Pawan Kalyan Suggest to Prepare the Movie Script to Anil Ravipudi For Upcoming Movie
X

అనిల్ రావిపూడి కి కండిషన్ పెట్టిన పవన్ కళ్యాణ్ 

Anil Ravipudi - Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం "భీమ్లా నాయక్" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రానా దగ్గుబాటి కూడా హీరోగా నటిస్తున్న ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుం కోషియిం" సినిమాకి రీమేక్ గా తెరకెక్కనుంది. సాగర్ కే చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మాత్రమే కాక పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" తో కూడా బిజీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ అనిల్ రావిపూడి కి కథ గురించి ఒక కండీషన్ పెట్టారట.

ఈసారి రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమా కాకుండా ఒక కామెడీ సినిమా తీయాలని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చే విధంగా కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్ కి ప్రాధాన్యతనిస్తూ ఒక మంచి కథని సిద్ధం చేయమని అనిల్ రావిపూడికి చెప్పారట. దీంతో "సరిలేరు నీకెవ్వరు" సినిమాలో ఈ మధ్యనే బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి పవన్ కళ్యాణ్ కోసం అలాంటి ఒక కామెడీ సినిమాని సిద్ధం చేయడంలో బిజీ అయ్యారు. మరో వైపు అనిల్ రావిపూడి ఈ మధ్యనే "ఎఫ్ 3" సినిమా షూటింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

admin1

admin1

Next Story