Pawan Kalyan: సరికొత్త లుక్తో షాకిస్తున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: మళ్లీ ఆ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్న పవర్ స్టార్

Rama Rao
Updated on: 5 Feb 2022 1:04 PM IST
Pawan Kalyan Shocked with New Look | Telugu Movie News
X

Pawan Kalyan: సరికొత్త లుక్తో షాకిస్తున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: గత కొంతకాలంగా కెమెరా కి దూరంగా ఉంటున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మీడియా ముందుకి రావడం బాగా తగ్గిపోయింది. తాజాగా ఉద్యోగుల సమ్మెకు మద్దతు ఇస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. పవన్ కళ్యాణ్ లుక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జుట్టు పెంచి గడ్డం ట్రిమ్ చేసి పవన్ కళ్యాణ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ మేక్ఓవర్ తన తదుపరి సినిమా "హరిహర వీరమల్లు" కోసం అని సమాచారం. క్రిష్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఒక వైపు భీమ్లా నాయక్ షూటింగ్ మరియు ఇతర రాజకీయ వ్యవహారాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ మధ్యనే "హరి హర వీర మల్లు" షూటింగ్ ను సెట్స్ పైకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఈ సినిమా మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమాని సైన్ చేసిన పవన్ కళ్యాణ్ తమిళ్ లో సముద్రఖని దర్శకత్వం వహించిన ఒక సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story