Pawan Kalyan Movie: పవన్ కళ్యాణ్ సినిమా ఆగిపోయినట్లేనా?

Pawan Kalyan Movie: పవన్ కళ్యాణ్ సినిమా ఆగిపోయినట్లేనా?

Rama Rao
Updated on: 22 Jun 2022 6:30 PM IST
Pawan Kalyan Sets a Deadline for Hari Hara Veera Mallu | Tollywood News
X

Pawan Kalyan Movie: పవన్ కళ్యాణ్ సినిమా ఆగిపోయినట్లేనా? 

Pawan Kalyan Movie: ఈ మధ్యనే "వకీల్ సాబ్", "భీమ్లా నాయక్" వంటి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో "హరి హర వీర మల్లు" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఎప్పుడో 2020 సెప్టెంబర్ లో మొదలైన ఈ సినిమాను ఏప్రిల్ 29, 2022 న విడుదల చేయాలనుకున్నారు కానీ ఈ సినిమా మళ్లీ వాయిదా పడింది. నిజానికి "భీమ్లా నాయక్" సినిమా కంటే ముందే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.

కానీ "భీమ్లా నాయక్" షూటింగ్ త్వరగా పూర్తయింది. ఇక "హరి హర వీర మల్లు" సినిమా షూటింగ్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. కొన్ని రోజులు పవన్ కళ్యాణ్ తన రాజకీయ పనులతో బిజీ అవ్వగా మరికొన్ని రోజులు స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇక ఆగిపోయినట్లే అని వార్తలు వినిపిస్తున్నాయి.

చారిత్రక నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ సినిమాని ప్యాన్ ఇండియా రేంజిలో విడుదల చేయాలని నిర్మాత ఏ.ఎం రత్నం ఇప్పటికే బాగా ఖర్చు చేశారు. కానీ ఫైనాన్స్ ఇబ్బందుల వల్ల ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ జరగటం లేదు అని తెలుస్తోంది. ఇక మరోవైపు దసరా తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ తన రాజకీయ పనుల్లో పూర్తిగా నిమగ్నం కానున్నారు. ఈ లోపు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేయటం అసాధ్యమనే చెప్పాలి. మరి ఈ క్లిష్ట పరిస్థితి నుంచి నిర్మాత ఏ.ఎం రత్నం ఎలా బయట పడతారో చూడాలి.

Rama Rao

Rama Rao

Next Story