Pawan Kalyan: నెలకు ఒక సినిమా అంటున్న పవన్ కళ్యాణ్..

* పవన్ కళ్యాణ్ వైఖరితో నిరాశ చెందుతున్న అభిమానులు

Dhatripriya
Updated on: 9 Feb 2023 9:30 PM IST
Pawan Kalyan Says One Movie A Month
X

నెలకు ఒక సినిమా అంటున్న పవన్ కళ్యాణ్ 

Pawan Kalyan: "వకీల్ సాబ్" మరియు "భీమ్లా నాయక్" సినిమాలతో మంచి విజయాలను అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈమధ్యనే సినిమాల కంటే ఎక్కువగా రాజకీయ పనులతోనే బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేతిలో బోలెడు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ అందులో ఒకటి కూడా ఇంకా విడుదల కి సిద్ధం అవ్వలేదు. ముఖ్యంగా క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా మొదలై చాలా కాలం గడిచింది. కానీ ఇంకా 40 నుంచి 50% షూటింగ్ పెండింగ్ లోనే ఉంది.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఈమధ్య నెలకి ఒక సినిమాని అధికారికంగా లాంచ్ చేస్తున్నారు కానీ షూటింగులను మాత్రం మొదలు పెట్టడం లేదు. గత ఏడాది డిసెంబర్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" అనే సినిమాని ఒక పూజా కార్యక్రమం తో లాంచ్ చేశారు. ఆ తర్వాత మళ్లీ మొన్నీ మధ్యనే జనవరిలో సుజిత్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాని పూజా కార్యక్రమం తో లాంచ్ చేశారు.

మళ్లీ ఇప్పుడు ఫిబ్రవరి 14న తమిళ్లో సూపర్ హిట్ అయిన "వినోదయ సితం" సినిమా తెలుగు రీమేక్ ను అధికారికంగా లాంచ్ చేయబోతున్నారు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఇలా నెలకి ఒక సినిమాని లాంచ్ చేస్తున్నారు కానీ అందులో ఒక్క సినిమా కూడా పట్టాలెక్కటం లేదు అని, నెలకో సినిమాని లాంచ్ చేయడం పవన్ కళ్యాణ్ కి ఒక అలవాటు లాగా మారిపోయిందని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలన్నింటినీ ఎప్పటికీ పూర్తి చేస్తారో వేచి చూడాలి.

Dhatripriya

Dhatripriya

Next Story