Hari Hara Veera Mallu Movie: మళ్లీ షూటింగ్ మొదలుపెట్టబోతున్న పవన్ కళ్యాణ్

* త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతున్న "హరిహర వీరమల్లు"

admin1
Updated on: 6 Oct 2021 4:53 PM IST
Pawan Kalyan Resumes Hari Hara Veera Mallu Movie Shooting Soon
X

మళ్లీ షూటింగ్ మొదలుపెట్టబోతున్న పవన్ కళ్యాణ్ (ట్విట్టర్ ఫోటో)

Hari Hara Veera Mallu Movie: ఈ మధ్యనే "వకీల్ సాబ్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇప్పుడు "అయ్యప్పనుమ్ కోషియుమ్" అనే సినిమా రీమేక్ అయిన "భీమ్లా నాయక్" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 25% పూర్తి అయిపోయింది చాలా సందర్భాల్లో క్రిష్ చెప్పారు. కానీ కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఉన్నట్టుండి ఈ ఏడాది మార్చిలో ఆగిపోయింది.

"ఇప్పటికీ చార్మినార్ మరియు మచిలీపట్నం పోర్ట్ వద్ద కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ ని పూర్తి చేసాము. కానీ కరోనా కేసులు ఉన్నట్లుండి ఎక్కువ అవడంతో షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు నవంబర్ రెండవ వారం నుంచి షూటింగ్ ను మళ్లీ సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాము. ఈ షెడ్యూల్ లో సినిమా ఫస్ట్ హాఫ్ షూటింగ్ ని పూర్తి చేయబోతున్నాం అని చెప్పుకొచ్చారు. మరోవైపు వైష్ణవ్ తేజ్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు క్రిష్. నిధి అగర్వాల్ మరియు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ "హరిహర వీరమల్లు" సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

admin1

admin1

Next Story