పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చేసిన రీమేక్ సినిమాలు ఇవే

పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చేసిన రీమేక్ సినిమాలు ఇవే
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా కెరియర్ ని మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్.. అయితే అతి కొద్ది కాలంలోనే పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి అని చెప్పుకునే స్థాయికి వెళ్ళిపోయాడు.

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా కెరియర్ ని మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్.. అయితే అతి కొద్ది కాలంలోనే పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి అని చెప్పుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. అజ్ఞాతవాసి సినిమా తరవాత పూర్తి స్థాయి రాజకీయాలకి పరిమితం అయిన పవన్ ప్రస్తుతం హిందీలో మంచి హిట్ అయిన పింక్ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో మొదలై శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఇంతవరకు పవన్ చేసిన రీమేక్ సినిమాల లిస్టు ఒక్కసారి చూద్దాం..

1. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి

పవన్ కళ్యాణ్ మొదటిచిత్రం ఇది.. ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ పై అల్లు అరవింద్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమాని హిందీలో అమీర్ ఖాన్ నటించిన ''ఖయామత్ సే ఖయామత్ తక్'' సినిమాని తెలుగు నేటివిటికి మార్చి తీశారు. సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

2. గోకులంలో సీత

పవన్ రెండో సినిమాగా 'గోకులంలో సీత' అనే సినిమా తెరకెక్కింది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో కార్తిక్ హీరోగా నటించిన ''గోకులతిల్ సీతై'' సినిమాకు రీమేక్.

3. సుస్వాగతం

ఇక పవన్ మూడో సినిమాగా 'సుస్వాగతం' సినిమా తెరకెక్కింది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని తమిళంలో విజయ్ హీరోగా నటించిన ''లవ్ టుడే'' సినిమాకి రీమేక్

4. తమ్ముడు

అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అమీర్ ఖాన్ నటించిన 'జో జీతా వహీ సికందర్' కి రీమేక్ .. అందులో అమీర్ ఖాన్ సైకిల్ పోటీలో పాల్గొంటే ఇక్కడ బాక్సింగ్ నేపధ్యంలో తెరకెక్కించారు.

5. ఖుషీ

ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ హీరో విజయ్ నటించిన ఖుషీ నుంచి రీమేక్ చేశారు. ఈ సినిమా అక్కడి కంటే ఇక్కడే బాగా ఆడింది.

6. అన్నవరం

చాలా గ్యాప్ తరవాత పవన్ కళ్యాణ్ చేసిన రీమేక్ ఇది అని చెప్పాలి. ఇది కూడా తమిళంలో విజయ్ హీరోగా యాక్ట్ చేసిన ''తిరుపాచి'' మూవీకి రీమేకే

7.తీన్‌మార్

జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో చేసిన ఈ సినిమా హిందీలో సైఫ్ అలీ ఖాన్ హీరోగా నటించిన ''లవ్ ఆజ్ కల్'' కు రీమేకే.

8. గబ్బర్ సింగ్ :

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని హిందీ మూవీ దబాంగ్ నుంచి రీమేక్ చేశారు. కానీ చాలా మార్పులతో ఈ సినిమాని తెరకెక్కించారు.

8. గోపాల గోపాల

కిషోర్ పార్థసాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హిందీలో మంచి హిట్టైనా 'ఓ మై గాడ్' సినిమాకి ఇది రీమేక్.. వెంకటేష్ మరో హీరోగా నటించాడు.

9. కాటమరాయుడు

తమిళ్ లో అజిత్ హీరోగా చేసిన వీరం సినిమాకి ఇది రీమేక్ ..

10. లాయర్ సాబ్

పవన్ రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా హిందీలో అమితాబ్ చేసిన పింక్ మూవీకి రీమేకే.. వేణు శ్రీరామ్ దర్శకుడు.. పవన్ అన్ని రీమేక్ సినిమాలను చూస్తే అక్కడి కథలని మాత్రమే బేస్ చేసుకొనితెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేసి హిట్లు కొట్టాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories