త్రివిక్రమ్ కు మంచి ప్యాకేజీ ఇవ్వమంటున్న పవన్ కళ్యాణ్...

Pawan Kalyan - Trivikram Srinivas: తాజాగా పవన్ కళ్యాణ్ "వినోదయ సితం" సినిమాని కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే...

Shireesha
Published on: 9 April 2022 1:54 PM IST
Pawan Kalyan Recommendation on Remuneration of Trivikram Srinivas | Tollywood News Today
X

త్రివిక్రమ్ కు మంచి ప్యాకేజీ ఇవ్వమంటున్న పవన్ కళ్యాణ్...

Pawan Kalyan - Trivikram Srinivas: ఇప్పటికే ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ నటించిన "భీమ్లా నాయక్" ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు మరియు స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ తన నిర్మాతలతో త్రివిక్రమ్ కు మంచి ప్యాకేజీ ఇవ్వమని అడుగుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి రెమ్యునరేషన్ తో పని లేకుండా పవన్ కళ్యాణ్ తో ఉన్న స్నేహం కోసమే త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి కంటెంట్ ను ఇస్తుంటారు. అయినా సరే పవన్ కళ్యాణ్ మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఊరికనే తన సినిమాలపై సమయాన్ని వెచ్చిస్తున్నట్లు ఉండకుండా పెద్ద మొత్తాన్ని రెమ్యునరేషన్ రూపంలో ఇస్తున్నారట.

అయితే మరోవైపు కొందరు మాత్రం పవన్ కళ్యాణ్ ఇలాంటి విషయాల్లో తలదూర్చడం లేదని త్రివిక్రమ్ కు మంచి ప్యాకేజీ ఇవ్వమని ఎవరికీ చెప్పలేదని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో "హరిహర వీరమల్లు" సినిమాతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ చేతిలో మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ "వినోదయ సితం" సినిమాని కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Shireesha

Shireesha

Next Story