Movies 2022: 2022లో రికార్డు సృష్టించబోతున్న ముగ్గురు స్టార్ హీరోలు

admin1
Updated on: 23 Aug 2021 2:00 PM IST
Pawan kalyan, Prabhas and Ram Charan may Creates History in 2022 with The Release of Three Movies Each
X

పవన్ కళ్యాణ్ - ప్రభాస్ - రామ్ చరణ్ (ఫైల్ ఫోటో)

Movie Releases 2022: థియేటర్లు మళ్ళీ ఓపెన్ అవ్వడంతో కరోనా వల్ల వాయిదా పడిన సినిమాలు, ఆగిపోయిన సినిమాలు, మరోవైపు కొత్త సినిమాలు అన్నీ వెంట వెంటనే విడుదల కు సిద్ధం అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లోని ముగ్గురు స్టార్ హీరోలు ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేని ఒక కొత్త రికార్డుని సృష్టించబోతున్నారు. వారే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

వచ్చే ఏడాది ఏకంగా మూడు సినిమాలను విడుదల చేస్తూ ఈ ముగ్గురు రికార్డుని సృష్టించనున్నారు. వివరాల్లోకి వెళితే, ప్రభాస్ "రాధేశ్యామ్" సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. "సలార్" కూడా 2022 ఏప్రిల్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. అలానే "ఆదిపురుష్" కూడా వచ్చే ఏడాది ఆగస్టు కి విడుదల కాబోతున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు.

మరో వైపు పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్" సినిమా కూడా సంక్రాంతి బరిలో దిగనుంది. క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న "హరిహర వీరమల్లు" సినిమా కూడా వేసవికాలంలో విడుదల కానుంది. అలాగే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా వచ్చే ఏడాది ఆఖరులో విడుదల కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న "ఆచార్య" మరియు "ఆర్ ఆర్ ఆర్" వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమయ్యాయి.

మరో వైపు రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న #ఆర్సీ15 కూడా వచ్చే యేడాది ఆఖర్లో విడుదలవుతుంది. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు ఒక ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమే గగనమైపోతున్న రోజులు. ఇలాంటి సమయంలో ఈ ముగ్గురు స్టార్ హీరోలు వచ్చే ఏడాది ఏకంగా మూడు సినిమాలను విడుదల చేయడం అంటే అది అతి పెద్ద రికార్డు అని చెప్పుకోవాలి.

admin1

admin1

Next Story