Movie News: అల్లు శిరీష్ సినిమా కోసం పవన్ కళ్యాణ్, బాలకృష్ణ...

Pawan Kalyan Or Balayya Who’s For Allu Sirish?
x

Movie News: అల్లు శిరీష్ సినిమా కోసం పవన్ కళ్యాణ్, బాలకృష్ణ...

Highlights

Movie News: అల్లు శిరీష్ సినిమా కోసం పవన్ కళ్యాణ్, బాలకృష్ణ...

Urvasivo Rakshasivo: ఒక బ్లాక్ బస్టర్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న యువ హీరో అల్లు శిరీష్ చాలా రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడు "ఊర్వశివో రాక్షసివో" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ సినిమా లో అను ఇమ్మాన్యువల్ హీరోయిన్ గా నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా నవంబర్ 4న థియేటర్లో విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ కొని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. సెప్టెంబర్ 30వ తేదీన చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని స్పష్టం చేసిన అల్లు అరవింద్. ఆ వేడుకకి ఒక స్టార్ హీరో కూడా విచ్చేయబోతున్నారు అని హింట్ ఇచ్చారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేదా నందమూరి బాలకృష్ణ లలో ఒకరు ముఖ్యఅతిథిగా విచ్చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తన మేనల్లుడి కోసం పవన్ కళ్యాణ్ రాజకీయ పనుల నుంచి బ్రేక్ తీసుకొని ఈ వేడుకకి వస్తారని కొందరు చెబుతుంటే మరికొందరు అన్స్టాపబుల్ షో ను నిర్మిస్తున్న అల్లు అరవింద్ కోసం ఈ సినిమా వేడుకకి బాలకృష్ణ వస్తారని చెబుతున్నారు. ఏదేమైనా ఈ సినిమా వేడుకకి ఏ స్టార్ హీరో రాబోతున్నారు అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories