Pawan Kalyan: రియల్ డాన్ బయోపిక్ గా తెరకెక్కనున్న OG

Pawan Kalyan OG to Show the Real Life of a Don
x

Pawan Kalyan: రియల్ డాన్ బయోపిక్ గా తెరకెక్కనున్న OG

Highlights

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ గా హరీష్ శంకర్ మేకింగ్ లో గబ్బర్ సింగ్ ఫ్లేవర్ ని రిపీట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ గా హరీష్ శంకర్ మేకింగ్ లో గబ్బర్ సింగ్ ఫ్లేవర్ ని రిపీట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. దాంతో పాటు ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ మూవీ కూడా చేస్తున్నాడు. ఐతే ఇదే కమల్ మూవీకి రీమేక్ అంటూ ప్రచారం ఊపందుకుంది.

లోకనాయకుడు కమల్ హాసన్ కెరీర్ లో మాస్టర్ పీస్ అంటే నాయకుడు మూవీనే. అప్పట్లో మణిరత్నం మేకింగ్ లో వచ్చిన ఈ సినిమా హాలీవుడ్ మూవీ గాడ్ ఫాదర్ ప్రేరణగా వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా పవన్ మూవీకి ప్రేరణగా మారుతోంది.

నాయకుడు సినిమాతోనే కమల్ పాన్ఇండియా లెవల్లో స్టార్ అనిపించుకున్నాడు. అప్పట్లో అంతగా ట్రెండ్ సెట్ చేసింది ఈ సినిమా. ఇన్నాళ్లకు ఈ మూవీకి రీమేకో, లేదంటే ప్రేరణ రూపంలో పవన్ సినిమా ఓజీ రాబోతోందని గుసగుసలు పెరిగాయి.

నిజానికి తమిళ నాడు నుంచి ముంబై చేరుకుని అక్కడ సెటిలైన హజీ మస్తాన్ లైఫ్ స్టోరీనే అప్పట్లో నాయకుడిగా మణిరత్నం తీశాడన్నారు. తర్వాత వన్స్ అప్ ఆన్ ఏ టైం ఇన్ ముంబైలో అజయ్ దేవ్ గన్ కూడా అలాంటి పాత్రే వేశాడన్నారు. ఇప్పుడు ఆ పాత్ర పవన్ వేస్తున్నాడని తెలుస్తోంది.

పవన్ డాన్ రూట్లో బాలు, పంజా ఇలా ప్రయోగాలు చేశాడు. కాని ఓ రియల్ డాన్ బయోపిక్ లాంటి మూవీ చేయలేదు. హజీ మస్తాన్ బయోపిక్ లాంటి మూవీనే ఓజీ అనేసరికి, ఇది నాయకుడు రీమేకా, వన్స్ అప్ ఆన్ ఏటైం ప్రేరణతో వస్తున్న మూవీనా అనే అంచనాలు పెరిగాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories