OG: 2025 సంక్రాంతి కాదు #OG ముందుగానే రావడం పక్కా

Pawan Kalyan OG Movie Update
x

OG: 2025 సంక్రాంతి కాదు #OG ముందుగానే రావడం పక్కా

Highlights

OG: పవన్ సైతం తాను ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిత్రాలను పక్కన పెట్టిమరీ సుజిత్ తో చేస్తున్న #OG పైనే ఫోకస్ పెట్టారు.

OG: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. వినోదయ సీతం ఇప్పటికే పూర్తికాగా, హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, #OG ఇలా మూడు క్రేజీ ప్రాజెక్టులు సెట్స్ పై ఉన్నాయి. అయితే వీటిలో ఫ్యాన్స్ ఫోకస్ అంతా #OG పైనే ఉంది. పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా, ముంబై బ్యాక్ డ్రాప్ లో సినిమాని సుజిత్ తెరకెక్కిస్తున్నాడని తెలియడంతో ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. వీరి అంచనాలకు తగ్గట్టే #OG మేకర్స్ అప్ డేట్స్ ఇస్తూ పవర్ స్టార్ అభిమానులను తెగ ఖుషీ చేస్తున్నారు.

ప్రస్తుతం #OG షూటింగ్ ముంబైలో జరుగుతుండగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఒక వార్త పవన్ ఫ్యాన్స్ ని డీలా పడేలా చేసింది. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ మూవీని ఈ ఏడాది లేదంటే నెక్ట్స్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఒకవైపు అనుకుంటుండగా..వారి ఊహాగానాలపై నీళ్లు చల్లుతూ 2025 సంక్రాంతికి #OG రిలీజ్ ఉంటుందని ఒక వార్త సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది.

ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కోసం రెండేళ్లు వెయిట్ చేయడం అంటే కష్టమని ఫ్యాన్స్ తెగ మధన పడిపోతుంటే..వారికి ఊరట దక్కేలా మరోవార్త తెరపైకి వచ్చింది. పవన్ కల్యాణ్ తన మిగతా చిత్రాలకంటే #OG పైనే స్పెషల్ ఫోకస్ పెట్టారని ఇండస్ట్రీ ఇన్ సైడర్స్ గుసగుసలాడుతున్నారు. పవన్ తన పొలిటికల్ కమిట్ మెంట్స్ నుంచి ఖాళీ దొరికితే ఎక్కువగా #OG షూటింగ్ కోసం కేటాయించాలని ఫిక్స్ అయ్యారని చెబుతున్నారు. పవన్ సైతం తాను ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిత్రాలను పక్కన పెట్టిమరీ సుజిత్ తో చేస్తున్న #OG పైనే ఫోకస్ పెట్టారు. ఇదంతా చూస్తుంటే ఎప్పుడో ప్రకటించిన హరిహరవీరమల్లు కంటే ముందుగా ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ థియేటర్స్ లోకి రావడం ఖాయమని అంటున్నారు. ఫ్యాన్స్ సైతం #OG కోసమే ఈగర్లీ వెయిటింగ్ అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories