#OG: పవన్ మూవీ కోసం 4 కథలతో సుజీత్ ప్రయోగం?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ నాయకుడు రీమేక్ అంటూ ఆమధ్య ప్రచారం జరిగింది.

Arun Chilukuri
Updated on: 20 Jun 2023 8:30 PM IST
Pawan Kalyan OG Movie Latest Update
X

#OG: పవన్ మూవీ కోసం 4 కథలతో సుజీత్ ప్రయోగం?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ నాయకుడు రీమేక్ అంటూ ఆమధ్య ప్రచారం జరిగింది. ఐతే ఆ స్టోరీ లైన్ కి మరో మూడు కథల్ని జోడించాడట డైరెక్టర్ సుజీత్. పవన్ పాత సినిమాల పాత్రలతో కమల్ మూవీ స్టోరీ లైన్ ని కలిపేస్తున్న దర్శకుడు అంటూ ప్రచారం పెరిగింది. దీంతో ఫ్యాన్స్ లో కొత్త టెన్షన్ షురూ అయ్యింది.

ఉస్తాద్ భగత్ సింగ్ కంటే ముందే పవన్ ఓజీ రెడీ అయ్యేలా ఉంది. సుజీత్ ప్లానింగ్ ఆరేంజ్ లో ఉంది కాబట్టే, ప్రాజెక్ట్ పరుగులు పెట్టేలాఉంది. క్రిస్మస్ కి వచ్చే ప్లాన్ చేస్తున్న ఈ సినిమా మొత్తంగా 4 మూవీల ప్రేరణతో రాబోతోందట. ఓజీ లో పవన్ పాత్ర గాంధి అని తన వదిన పగకోసం ఫైట్ చేసే వ్యక్తిటా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇక పంజాలో పవన్ లుక్ నే ఓజీ కి కంటిన్యూ చేస్తున్నాడట డైరెక్టర్ సుజీత్. పవన్ లుక్స్ లో అది తన ఫేవరెట్ అని, అందుకే కంటిన్యూ చేస్తున్నాడని తెలుస్తోంది.

ఇక బాలులో తన గురువుతోనే విరోదం పెట్టుకునే పాత్రలో పవన్ కనిపించాడు. ఇక్కడ ఓజీలో కూడా తన గురువు లాంటి విలన్ ని మట్టుపెట్టి డాన్ గా మారే కథాంశం ఉందని తెలుస్తోంది. ఓరకంగా ఇది బాలుకి సీక్వెల్ లాంటి ప్రయోగం అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక పవన్ కెరీర్ లోనే మోస్ట్ కామెడీ కమ్ మాస్ యాక్షన్ డ్రామా అంటే గుడుంబా శంకర్. ఇందులో పవన్ టైమింగ్ ఓరేంజ్ లో ఉంటుంది. ఐతే ఈ సినిమాలో సీన్లను కూడా కొన్ని దింపేయబోతున్నాడట సుజీత్. ఓరకంగా తన ఫేవరెట్ హీరో చేసిన సినిమాల్లో టాప్ సీన్స్ ని రీక్రియేట్ చేయాలనేది సుజీత్ నిర్ణయం అని తెలుస్తోంది.

బాలు పాటని కూడా ఓజీలో రీమెక్స్ చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయట. పవన్ సినిమాల్లో ఎవైతే డైరెక్టర్ సుజీత్ కి చాలా ఇస్టమో, వాటిలోని సీన్లనో, సాంగ్స్ నో లేదంటే, గెటప్పులనో తన ఓజీలో కంటిన్యూ చేస్తూ, ఫ్యాన్స్ ని పాతరోజుల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడట సుజీత్. ఇక ఇప్పటికే ఓజీ మూవీ కథ కమల్ హాసన్ హిట్ మూవీ నాయకుడు స్టోరీ లైన్ ప్రేరణతో వస్తోందనే ప్రచారం జరుగుతోంది. దీనికి ఇప్పుడు బాలు, గుడుంబా శంకర్, పంజా సినిమాలు తోడయ్యాయి. నాలుగు కథ రీమిక్స్ గా ఓజీ వచ్చేలా ఉందనే మాటలే వినిపిస్తున్నాయి

సుజీత్ రన్ రాజా రన్, సాహో తర్వాత గ్యాప్ తీసుకున్నా పవన్ తో మూవీ తీస్తూ భారీ ఆఫర్ పట్టేశాడు. అయితే అక్కడితో కూల్ కాకుండా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అంశాలన్నీ మేలవించి, ఓజీనీ వేగంగా పూర్తి చేసేలా ప్లాన్ చేశాడు. తన దూకుడుతో షాక్ ఇస్తున్నాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story