Pawan Kalyan With Surendar Reddy : సైరా దర్శకుడితో పవన్!

Pawan Kalyan With Surendar Reddy : సైరా దర్శకుడితో పవన్!
x
pawan kalyan (File Photo)
Highlights

Pawan Kalyan With Surendar Reddy :రాజకీయాలతో రెండేళ్ళు బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి

Pawan Kalyan With Surendar Reddy :రాజకీయాలతో రెండేళ్ళు బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే... అందులో భాగంగా అయన రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ తెరకెక్కుతుంది. ఇది పవన్ కి 26 వ చిత్రం కావడం విశేషం.. హిందీలో వచ్చిన పింక్ సినిమాకి ఇది రీమేక్ ..ఇందులో అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ క‌పూర్‌, దిల్ రాజుకలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.. కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది.

ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాని పవన్ లైన్ లో పెట్టారు. ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక దీని తర్వాత పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు ఒకే చెప్పారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ న్యూస్ ట్విట్టర్ లో చక్కర్లు కొడుతుంది..

ఈ సినిమాను ఎస్‌ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌ 2వ కంటే ముందు అంటే సెప్టెంబర్‌ 1న ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక సురేందర్ రెడ్డి గత ఏడాది సైరా నరసింహ రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories