PSPK27: పవర్‌ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

PSPK27: పవర్‌ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
x

పవన్ కళ్యాణ్ ఫైల్ ఫోటో 

Highlights

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు ప్రముఖ దర్శకుడు క్రిష్. పవన్ అప్ డేట్స్ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తుంటారు....

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు ప్రముఖ దర్శకుడు క్రిష్. పవన్ అప్ డేట్స్ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తుంటారు. పవన్ సినిమాల గురించి ఏ చిన్న వార్త వచ్చిన విస్ అవ్వరు. వకీల్ సాబ్ తర్వాత క్రిష్ తో పవన్ సినిమా ఎప్పుడు మొదలవుతుందా? అని అభిమానలు ఆత్రుతలో ఎదురుచూస్తున్నారు. కాగా.. ఆయన అభిమానులకు కిక్ ఎక్కించే న్యూస్ ఒకటి వచ్చింది. ఇక 'పీఎస్‌పీకే27' చిత్రం దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పీరియాడికల్‌ డ్రామాగా రూపొందుతుంది. ఇప్పటికే చిత్రీకరణ జరుపుకోవాల్సిన ఈ సినిమా డైరెక్టర్‌ క్రిష్‌కు కరోనా సోకడంతో వాయిదా పడింది. కాగా.. ఈ సినిమా షూటింగ్‌ను‌ ప్రారంభిస్తున్నట్లు క్రిష్‌ సోషల్‌ మీడియా వేదికగా మంగళవారం ప్రకటించారు.

క్రిష్ కరోనా నుంచి కోలుకోవడం, 'వకీల్‌ సాబ్'‌ షూటింగ్‌ కూడా పూర్తి చేసుకోవడంతో హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలు పెట్టారు. క్రిష్‌ ఈ సినిమాను'పీఎస్‌పీకే27' అంటూ సెట్స్‌లో బిజీగా ఉన్నఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. పిరియాడికల్‌ డ్రాప్‌లో రూపొందిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను 'విరుపాక్ష' పేరుతో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం‌ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మెగా సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ లోకేషన్‌కు సంబంధించిన ఫొటోలను దర్శకుడు తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో పవన్‌ ఓ సినిమా ఈ సినిమాతో పాటు చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఈ రెండు చిత్రాలు షూటింగ్‌ ఒకే సమయంలో ‌జరుపుకోనున్నాయంటూ టాలీవుడ్‌ వర్గాల నుంచి సమచారం. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సివుంది. పవర్‌ స్టార్‌ నటిస్తున్న 'వకీల్‌ సాబ్‌' మూవీ షూటింగ్‌ గతేడాది డిసెంబర్‌లో పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన టీజర్ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ కు మంచి రెస్ఫాన్స్ వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories