Antha Istam Song Promo: అంత ఇష్టమే.. "భీమ్లా నాయక్" అందరికీ ఇష్టమే

* భీమ్లా నాయక్ "అంత ఇష్టం" పాట ప్రోమో విడుదల చేసిన చిత్ర యూనిట్

Sandeep Reddy
Updated on: 14 Oct 2021 12:21 PM IST
Pawan Kalyan New Movie Bheemla Nayak Antha Istam Song Promo Released Today 14th October 2021
X

Bheemla Nayak Antha Istam Song Promo 

Bheemla Nayak Antha Istam Song Promo: వకీల్ సాబ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో పవర్ ఫుల్ పెర్ఫార్మన్స్ తో మలయాళ సూపర్ హిట్ సినిమా "అయ్యప్పన్ కోశియమ్" రీమేక్ "భీమ్లా నాయక్" గా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవలే భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ తో అభిమానులను ఆకట్టుకున్న పవర్ స్టార్ కి సంబంధించిన రెండో పాట ప్రోమోని విడుదల చేసింది "భీమ్లా నాయక్" చిత్ర యూనిట్.

"అంత ఇష్టం ఏందయ్య నీకు నా మీన అంత ఇష్టం ఏందయ్యా నీకు" అంటూ సాంగ్ ప్రోమోని విడుదల చేసింది. ఈ పాటని అక్టోబర్ 15న దసరా కానుకగా ఉదయం 10.19 నిమిషాలకు విడుదల చేయనున్నారు. విడుదలైన కాసేపటికే లక్షల్లో వ్యూస్ తో ఈ సాంగ్ ప్రోమో యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జంటగా నిత్య మీనన్ నటించింది.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story