పవన్ కళ్యాణ్ దసరా గిఫ్ట్ ఇచ్చేశాడు!

పవన్ కళ్యాణ్ దసరా గిఫ్ట్ ఇచ్చేశాడు!
x
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి దసరా గిఫ్ట్ ఇచ్చేశాడు.. పవన్ కొత్త మూవీకి సంబంధించిన ఓ ప్రకటన విడుదలైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో పవర్ స్టార్ ఓ సినిమాని చేయనున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ ఓ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి దసరా గిఫ్ట్ ఇచ్చేశాడు.. పవన్ కొత్త మూవీకి సంబంధించిన ఓ ప్రకటన విడుదలైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో పవర్ స్టార్ ఓ సినిమాని చేయనున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ ఓ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనుండగా, సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటనను వీడియో రూపంలో చిత్ర యూనిట్ దసరా కానుకగా విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ పోలిస్ గెటప్ లో కనిపిస్తూ ఉండడం, యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర ఛాన్స్ ఇవ్వడంతో సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.

అటు పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలా సినిమాలకి కమిట్ అయి ఉన్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ అనే సినిమా తెరకెక్కుతుంది. పవన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'ఓ మై ఫ్రెండ్' ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో పవన్ తో పాటుగా నివేదా థామస్, అంజలి, అనన్య ముఖ్యపాత్రాలు పోషిస్తున్నరు.. వచ్చే ఏడాది సంక్రాంతికి వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది అని సమాచారం.. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాకి ఇది రీమేక్. ఇక ఈ సినిమాతో పాటుగా క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డ్తి డైరెక్షన్ లలో సినిమాలను చేసేందుకు పవన్ కమీట్ అయ్యారు.


Show Full Article
Print Article
Next Story
More Stories