వకీల్ సాబ్ ఫోటోలు లీక్.. కొత్త లుక్ లో పవన్ అదుర్స్!

కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ తాజాగా హైదరాబాద్ లో మళ్ళీ మొదలైంది. పవన్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆ మధ్య మెట్రోలో పవన్ కళ్యాణ్ తో కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు

Krishna
Published on: 17 Dec 2020 2:24 PM IST
వకీల్ సాబ్ ఫోటోలు లీక్.. కొత్త లుక్ లో పవన్ అదుర్స్!
X

అజ్ఞాతవాసి చిత్రం తరవాత సినిమాలకి దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ వకీల్ సాబ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండగా, 'ఓ మై ఫ్రెండ్' ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో పవన్ తో పాటుగా నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రాలు పోషిస్తున్నారు. పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయగా, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ తాజాగా హైదరాబాద్ లో మళ్ళీ మొదలైంది. పవన్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆ మధ్య మెట్రోలో పవన్ కళ్యాణ్ తో కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. తాజాగా హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో షూటింగ్ చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పవన్ ని చూసేందుకు సెట్ లోకి వచ్చారు. అక్కడ పవన్ తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు.

దీనితో సినిమాలో పవన్ కి సంబంధించిన లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇందులో పవన్ చాలా యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ షెడ్యుల్ లో సినిమాకి సంబంధించిన యాక్షన్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో సినిమాని రిలీజ్ చేయనున్నారు.

Krishna

Krishna

Next Story