Pawan Kalyan: పవన్ కళ్యాణ్ షాకింగ్ డెసిషన్.. మళ్ళీ సినిమాలకు బ్రేక్?

Pawan Kalyan: రీమేక్ సినిమాలు కావాలి అంటున్న పవన్ కళ్యాణ్

admin1
Updated on: 21 Oct 2021 6:01 PM IST
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ షాకింగ్ డెసిషన్.. మళ్ళీ సినిమాలకు బ్రేక్?
X

రీమేక్ సినిమాలు కావంటున్న పవన్ కళ్యాణ్ (ఫైల్ ఇమేజ్)

Pawan Kalyan: ఒక వైపు సినిమాలు మరో వైపు రాజకీయాలు అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు పడవల మీద ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి అనే సమయంలో మాత్రం సినిమాల కి కొంచెం బ్రేక్ ఇచ్చి జనసేన పార్టీ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు పవన్ కళ్యాణ్. గత ఎన్నికలలో కూడా పవన్ కళ్యాణ్ ఇలాగే చేశారు. ఇప్పుడు తాజాగా 2024లో జరగనున్న ఎన్నికల సమయంలో కూడా పవన్ కళ్యాణ్ అదే స్ట్రాటజీ వాడబోతున్నరు. 2024 లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2022 పూర్తయ్యే లోపల ప్రస్తుతం తనకున్న సినిమా కమిట్మెంట్లు అన్నిటిని పూర్తి చేయాలని అనుకుంటున్నారు.

2023 మరియు 2024 మొత్తం పవన్ కళ్యాణ్ జనసేన మీద మాత్రమే దృష్టి పెట్టబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తన వద్దకు వచ్చిన నిర్మాతలు మరియు డైరెక్టర్లను రీమేక్ సినిమాల కోసం అడుగుతున్నారట. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మరియు రానా నటిస్తున్న "భీమ్లా నాయక్" మలయాళం సినిమా రీమేక్ అని తెలిసిన విషయమే. మరోవైపు "డ్రైవింగ్ లైసెన్స్" అనే మరొక మలయాళం సినిమా ని కూడా రీమేక్ చేయాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. ఇదే కాకుండా పవన్ కళ్యాణ్ మరికొన్ని రీమేక్ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఏ సినిమా ని రీమేక్ చేయబోతున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

admin1

admin1

Next Story