Hari Hara Veera Mallu : షూటింగ్‌కు రెడీ అవుతున్న పవన్ కల్యాణ్... తాజా షెడ్యూల్ ఎప్పుడంటే...

పవన్ హీరోగా తెరకెక్కుతోన్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ ‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 23 Sept 2024 6:44 PM IST
pawan kalyan latest movie hari hara veera mallu release date announced
X

Hari Hara Veera Mallu: షూటింగ్‌కు రెడీ అవుతున్న పవన్ కల్యాణ్... తాజా షెడ్యూల్ ఎప్పుడంటే...

పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ తమ అభిమాన హీరోను మళ్లీ వెండి తెరపై చూసుకోవాలని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్‌ సినిమాల్లో నటిస్తారో లేదో అనే అనుమానాలు చాలా ఉన్నాయి. అయితే ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను కచ్చితంగా పూర్తి చేస్తానని పవన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ వార్త ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.

పవన్ హీరోగా తెరకెక్కుతోన్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ ‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హరి హర వీరమల్లు సినిమాను వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రాన్ని క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా తీసుకొస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌కి సంబంధించి ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయింది. అయితే పవన్‌కు సంబంధించిన కొన్ని సీన్స్‌ మాత్రం బ్యాలెన్స్‌ ఉన్నాయి.

ఎన్నికలు రావడం ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీగా మారడంతో షూటింగ్‌ వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్‌ షూటింగ్‌లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. సోమవారం నుంచి షూటింగ్‌ ప్రారంభమైంది. ఇందుకోసం గాను విజయవాడలో భారీ సెట్ వేశారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పాల్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇందులో పవన్‌తో పాటు పలువురు కీలక నటులు భాగం కానున్నారు.

చిత్ర యూనిట్ చేసిన ఈ ప్రకటనతో పవర్ స్టార్ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుండగా. తొలిపార్ట్‌ను స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో విడుదల చేయనున్నారు ఈ సినిమాలో పవన్‌కు జోడిగా నిధి అగర్వాల్‌ నటిస్తుండగా.. అనుపమ్‌ఖేర్‌, బాబీ దేవోల్‌, నోరాహి ఫతేహి, విక్రమ్‌ జీత్‌, జిషుసేన్‌ గుప్త కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story