Lala Bheemla Song: "లాలా భీమ్లా" వచ్చేశాడు.. పాటతోనే రికార్డులను పేల్చేశాడు

*భీమ్లా నాయక్ చిత్రం నుండి పవన్ కళ్యాణ్ "లాలా భీమ్లా" పాట విడుదల

Sandeep Reddy
Updated on: 7 Nov 2021 11:31 AM IST
Pawan Kalyan Lala Bheemla Song Song Released From Bheemla Nayak Movie Today 07 11 2021
X

పవన్ కళ్యాణ్ లాలా భీమ్లా సాంగ్ రిలీజ్ 

Lala Bheemla Song: మలయాళ సూపర్‌ హిట్‌ సినిమా 'అయ్యప్పనుమ్‌ కోషియమ్' తెలుగులో "భీమ్లా నాయక్" గా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా ప్రధాన పాత్రల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ తో పాటు అంతా ఇష్టం ఏందయ్య మెలోడీ సాంగ్ కూడా సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచుస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాలా భీమ్లా ఫుల్ సాంగ్ తాజాగా విడుదలైంది. లాలా భీమ్లా సాంగ్ ను మేకర్స్ నవంబర్ 7న ఉదయం 11.07 నిమిషాలకు విడుదల చేశారు.

ఇటీవల విడుదలైన లాలా భీమ్లా వీడియో ప్రోమోలో పవన్ కళ్యాణ్ నుదుటిన తిలకంతో.. మందు సీసాతో "నాగరాజు గారు హార్టీ కంగ్రాచ్యులేషన్స్‌ అండి.. మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసింది.. హ్యాపీ దీపావళి" అంటూ చెప్పిన డైలాగ్ పవర్ స్టార్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక తాజాగా విడుదలైన కాసేపటికి ఈ పాట మంచి వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రేండింగ్ లో నిలిచింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ జంటగా నిత్య మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న భీమ్లా నాయక్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story