బాలకృష్ణ సినిమాకి సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్

* 2020లో చిరంజీవి అల్లు అర్జున్ కి చేసింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవికి చేయబోతున్నారా?

Jyothi
Updated on: 25 Dec 2022 6:30 PM IST
Pawan Kalyan Is Supporting Balakrishna Movie
X

బాలకృష్ణ సినిమాకి సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్

Tolly Wood: నందమూరి బాలకృష్ణ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా "వీరసింహారెడ్డి" "క్రాక్ట్" ఫేమ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతుంది. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిధి గా విచ్చేసినట్లు తెలుస్తోంది.

అయితే విరసింహారెడ్డి సినిమా మరియు మెగాస్టార్ చిరంజీవి నటించిన "వాల్తేరు వీరయ్య" సినిమాలు రెండు బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే. అయినాప్పటికీ పవన్ కళ్యాణ్ బాలయ్య సినిమా ప్రమోషన్లకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇలాంటి ఒక సంఘటన జరగటం ఇది మొదటిసారి కాదు .గతంలో 2020 సంక్రాంతి సమయంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న "సరిలేరు నీకెవ్వరు" సినిమా ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అదే సినిమాతో పాటు మెగాస్టార్ మేనల్లుడు అల్లు అర్జున్ నటించిన "అల వైకుంఠపురం లో " సినిమా కూడా విడుదలైంది . ఈ రెండిటి మధ్య బాక్సాఫీస్ వద్ద క్లాష్ ఏర్పడింది.

ఇప్పుడు మళ్లీ 2023లో పవన్ కళ్యాణ్ తన అన్న వాల్తేరు వీరయ్య సినిమా కంటే బాలకృష్ణ వీర సింహ రెడ్డి సినిమాని ప్రమోట్ చేయటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఏదేమైనా రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో క్లాస్ కే సేదమవుతున్నాయి. మరి ఈ రెండు సినిమాలలో ఏది బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి విజేతగా నిలుస్తుందో ఇంకా ఎదురు చూడాల్సి ఉంది.

Jyothi

Jyothi

Next Story