Renu Desai: పవన్ డబ్బు మనిషి కాదు.. పేదల సేవ కోసమే కుటుంబాన్ని పక్కన పెట్టేశారు..!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ నిరుపేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారని, ఆయన డబ్బు మనిషి అసలే కాదంటూ ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్‌ కౌంటర్ ఇచ్చింది.

Arun Chilukuri
Published on: 10 Aug 2023 4:53 PM IST
Pawan Kalyan is not a Money man Says his ex-wife Renu Desai
X

Renu Desai: పవన్ డబ్బు మనిషి కాదు.. పేదల సేవ కోసమే కుటుంబాన్ని పక్కన పెట్టేశారు..!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ నిరుపేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారని, ఆయన డబ్బు మనిషి అసలే కాదంటూ ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్‌ కౌంటర్ ఇచ్చింది. రేణూ దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమేరకు ఒక వీడియోను పంచుకుంది. పవన్‌ లాంటి వారు చాలా అరుదుగా ఉంటారని, రాజకీయంగా ఆయన పాటిస్తున్న విధానలు, చేస్తోన్న సేవలు బాగున్నాయని, ఆయనకే నా మద్దతు ఉంటుందని వీడియోలో ప్రకటించారు. అలాగే ప్రస్తుతం సంచలనంగా మారిన బ్రో సినిమాపైనా ఆమె తన వాయిస్ వినిపించారు.

‘‘ఆయన రాజకీయ ప్రవేశం చేసిన నాటి నుంచి నేటి వరకూ నేను పవన్‌కు సపోర్ట్ చేస్తున్నాను. నా జీవితంలోనూ ముందుకు వెళ్తున్నాను. పవన్ సమాజం కోసం ఎంతో సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. మంచి చేసేందుకు సిద్ధమయ్యారు. పవన్ చాలా అరుదైన వ్యక్తి. అంతేకానీ డబ్బు మనిషీ కానేకాదు. మనీపై ఆయనకు అస్సలు ఆసక్తే లేదు. రాజకీయంగా పవన్ చేస్తున్న సేవలను గుర్తిస్తే మంచిది. పవన్ విజయవంతమైన ఓ నటుడు. ప్రజలకోసం కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. పనీ పాటా లేనట్లు.. ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాత్రం పదేపదే రాద్దాంతం చేయకండి. 3 వివాహాలంటూ రచ్చ చేయడం ఆపండి. పిల్లలను ఇలాంటి చిల్లర విషయాల్లోకి లాగొద్దు. వాళ్లు చాలా చిన్నపిల్లలు అని గుర్తుంచుకోండి’’ అంటూ పవన్‌పై వస్తోన్న విమర్శలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

కాగా, ఇక బ్రో సినిమా వివాదంపైనా మాట్లాడుతూ.. పిల్లలను ఇలాంటి విషయాల్లోకి లాగొద్దు. వ్యక్తిగత జీవితాలను రాజకీయంగా ముడిపెట్టవద్దంటూ చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్‌పై సినిమా తీస్తామని, ఆయన మూడు వివాహాలను అందులో చూపిస్తామంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. అందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానంటూ పేర్కొన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story