ప్రియాంకతో రొమాన్స్ చేయబోతున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan is Going to Romance with Priyanka
x

ప్రియాంకతో రొమాన్స్ చేయబోతున్న పవన్ కళ్యాణ్

Highlights

Pawan Kalyan: నాని హీరోయిన్ తో జత కట్టనున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల్లో ఇప్పుడు బోలెడు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో "సాహో" ఫేమ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా ఒకటి. "ఓజీ" అనే ఆసక్తికరమైన టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలావరకు ఈ సినిమా షూటింగ్ ముంబైలోనే జరగబోతుందట. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర గురించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా నటించడానికి ఒక టాలెంటెడ్ హీరోయిన్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఆ హీరోయిన్ మరెవరో కాదు ప్రియాంక ఆరుల్ మోహన్. నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రియాంక ఆ తర్వాత శర్వానంద్ సరసన "శ్రీకారం" సినిమాలో కూడా నటించింది.

తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకుంది ఈ భామ. ఈ సినిమా ఖచ్చితంగా ప్రియాంక కెరీర్ ను కూడా కీలక మలుపు తిప్పుతుంది అని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు", "వినోదయ సితం" తెలుగు రీమేక్ మరియు "ఉస్తాద్ భగత్ సింగ్" తో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories