Pawan Kalyan: త్రివిక్రమ్ తో నిర్మాత గా మారబోతున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: విలన్ కోసం నిర్మాతగా మారిన పవన్ కళ్యాణ్

admin1
Published on: 23 Dec 2021 4:42 PM IST
Pawan Kalyan is going to become a Producer with Director Trivikram Srinivas
X

త్రివిక్రమ్ తో నిర్మాత గా మారబోతున్న పవన్ కళ్యాణ్ 

Pawan Kalyan: ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూడు సినిమాలు బయటకు వచ్చాయి. అందులో "జల్సా", "అత్తారింటికి దారేది" సినిమాలు బ్లాక్ బస్టర్ లుగా మారగా, "అజ్ఞాతవాసి" సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ లను అందిస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం వీరిద్దరూ కలిసి ఇప్పుడు ఒక సినిమాని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. సముతిరఖని ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన "అల వైకుంఠపురం లో" సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించిన సముతిరఖని ఇప్పుడు ఒక సినిమాకి దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు.

"అల వైకుంఠ పురం లో" సినిమా షూటింగ్ లో సముతిరఖనితో స్నేహం ఏర్పరచుకున్న త్రివిక్రమ్ ఈ సినిమాని ఫార్చ్యూన్ 4 పతాకంపై నిర్మించనున్నారు. కంటెంట్ బేస్డ్ ఎమోషనల్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నిర్మాణంలో త్రివిక్రమ్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా పాలు పంచుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టు కూడా తెలుస్తోంది.

admin1

admin1

Next Story