Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో మరోసారి జతకట్టనున్న దిల్ రాజు?

Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల 'వకీల్ సాబ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Venkata Chari
Published on: 26 April 2021 10:31 PM IST
Pawan Kalyan in Vamshi Paidipallys direction?
X

పవన్ కళ్యాణ్, వంశీ పైడిపల్లి (ఫొటో దిహాన్స్ ఇండియా)

Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల 'వకీల్ సాబ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయింది. వేణు శ్రీరామ్ దర్శకుడిగా పనిచేసిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. దిల్ రాజు మరోసారి పవన్ కళ్యాణ్‌తో జతకట్టాలని యోచిస్తున్నట్లు ఫిల్మ్ నగర్‌లో వార్తులు వినిపిస్తున్నాయి.

తాజా సమాచారం మేరకు, ఈ చిత్రానికి దర్శకుడు వంశీ పైడిపల్లికి అవకాశం ఇచ్చేందుకు దిల్ రాజు ఆలోచిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. 'ఊపిరి' మినహా వంశీ అన్ని చిత్రాలను దిల్ రాజు నిర్మించారు. వంశీ చివరి చిత్రం మహర్షిని కూడా దిల్ రాజు నిర్మించారు.

ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని, వంశి పైడిపల్లి ఈ చిత్రం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్ తో పనిచేసేందుకు వచ్చిన అవకాశాన్ని కోల్పోవటానికి ఏ దర్శకుడు ఇష్టపడడు. ఈ చిత్రం త్వరలో ఖరారు కానుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Venkata Chari

Venkata Chari

Next Story