ఏపీలో పొలిటికల్ హీట్‌కి సెట్లో నలిగిపోతున్న హీరోయిన్లు.. పవర్ స్టార్ హీరోయిన్లకు సెట్లో కష్టాలు..!

Pawan Kalyan Heroines: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాగ్ భగద్ సింగ్ షూటింగ్ మళ్లీ డైలామాలో పడింది.

Arun Chilukuri
Updated on: 13 Sept 2023 8:30 PM IST
Pawan Kalyan Heroines Face Difficulties in Film Sets
X

ఏపీలో పొలిటికల్ హీట్‌కి సెట్లో నలిగిపోతున్న హీరోయిన్లు.. పవర్ స్టార్ హీరోయిన్లకు సెట్లో కష్టాలు..!

Pawan Kalyan Heroines: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాగ్ భగద్ సింగ్ షూటింగ్ మళ్లీ డైలామాలో పడింది. ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగినప్పుడల్లా పవన్ సినిమాల షూటింగ్ ష్కెడ్యూల్స్ మారిపోతోంది. ఈ ప్రాసెస్ లో ఎక్కువగా హీరోయిన్లకే కష్టాలు ఎదురౌతున్నాయి. ఆలిస్ట్ లో ఇప్పుడు శ్రీలీలా కూడా చేరిపోయింది.

ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పవన్ లేకుండానే జరుగుతోంది. ఏపీలో పొలిటికల్ హీట్ పెరగగానే పవన్ అటు వైపు అడుగులేయటం, తను లేకపోవటంతో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కి బ్రేక్ పడటం జరిగాయి. ఐతే పవన్ లేని సీన్లను తెరకెక్కిస్తూ అలా టైం సేవ్ చేసుకుంటున్నాడట హరీష్ శంకర్. కాని ఇదే శ్రీలీలకి పంచ్ పడేలా చేస్తోంది. స్కంద మూవీ తో దాడికి రెడీ అయిన శ్రీలీలీ మరో ఐదారు రోజుల్లో భగవంత్ కేసరి షూటింగ్ పూర్తి చేయబోతోంది. ఆతర్వాత గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ తోనే బిజ అన్నారు. కాని పవన్ సెట్లో అడుగుపెట్టే పరిస్థితి లేక షూటింగ్ ఆగేలా ఉంది. ఇక్కడే శ్రీలీలకి ఇబ్బందులు తప్పేలా లేవు.

హీరోలేకుండా కొన్ని సీన్లు తెరకెక్కిస్తారు కాని, తను వస్తేనే హీరోయిన్ తో కాంబినేషన్ సీన్లు తీయగలరు. సో అవయ్యే వరకు శ్రీలీలా డేట్లు ఇక్కడ లాక్ అవుతాయి. ఆల్రెడీ అఖిల్ మూవీని డేట్లు అడ్జెస్ట్ చేయలేక వదులుకున్న శ్రీలీలకి ఉస్తాద్ భగత్ సింగ్ వల్ల ఇంకెన్ని సినిమాలు వదులుకునే పరిస్థితులుంటాయో అన్న మాటలే వినిపిస్తున్నాయి.

ఇక హరి హర వీరమల్లు హీరోయిన్ పరిస్తితి మరీ ఘోరంగా తయారైందట. పవన్ తో క్రిష్ తీస్తున్న మూవీ హరి హర వీరమల్లు. రెండేళ్లుగా సెట్లో నానుతున్న ఈమూవీ మీదే ఆశలు పెట్టుకుంది నిధీ అగర్వాల్. కాని ఏమైంది ఇది పూర్తి కాదు, నిధి విధిరాత మారదు.

నిధి అగర్వాలే కాదు, మరో లేడీ ప్రియాంక అరుల్ మోహన్ కూడా ఇదే పరిస్థితిని ఫేస్ చేస్తోంది. ఓజీ లో పవన్ లేని సీన్లు తీస్తూ పవన్ చేయాల్సిన సీన్లు తీస్తూ మొత్తంగా 60 శాతం షూటింగ్ పూర్తి చేశాడు సుజీత్. కాని ఇప్పుడు తీయాల్సింది అన్నీ ప్రియాంకతో పవన్ కాంబినేషన్ సీన్లు అవి పూర్తవక పోతే ప్రియాంక మరో మూవీ చేసే చాన్స్ ఉండదు. అసలు ఈ సినిమా పూర్తవద.. అలా చూస్తే పవన్ తోజోడీకట్టామన్న ఆనందమే తప్ప దాని ఫలితం మాత్రం ఇంకా ఈ హీరోయిన్లకు అందట్లేదు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story