మళ్లీ ఇన్నాళ్ల తర్వాత టాలీవుడ్ ను పలకరించనున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

*దాదాపు 15 తర్వాత తెలుగు సినిమా ఓకే చేసిన మలయాళం క్రేజీ హీరోయిన్..

Jyothi
Updated on: 15 Feb 2023 8:30 PM IST
Pawan Kalyan Heroine Re Entry into Tollywood
X

మళ్లీ ఇన్నాళ్ల తర్వాత టాలీవుడ్ ను పలకరించనున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

Meera Jasmine: మీరా జాస్మిన్ టాలీవుడ్ లో ఈ పేరు వినపడి చాలా కాలం అయింది. కానీ చాలా మంచి సినిమాలలో నటించిన మీరాజాస్మిన్ కి ఇప్పటికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. "అమ్మాయి బాగుంది" అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ మలయాళం భామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన "గుడుంబా శంకర్", మాస్ మహారాజా రవితేజ తో "భద్ర", విశాల్ తో "పందెం కోడి", గోపీచంద్ తో "రారాజు", సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణతో "మహారథి", రాజశేఖర్ "గోరింటాకు" వంటి సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక మంచి ముద్ర వేయించుకుంది.

తన అందంతో మాత్రమే కాక నటనతో కూడా అందరి దృష్టిని ఆకర్షించే మీరా జాస్మిన్ "మోక్ష" అనే హారర్ థ్రిల్లర్ తర్వాత తెలుగు తెరపై కనిపించలేదు. ఈ సినిమా విడుదల అయి దాదాపు 15 అవుతుంది. మీరా జాస్మిన్ అప్పటి నుంచి మలయాళం సినిమాలకు మాత్రమే పరిమితమైంది. అయితే గత కొద్దిగా నెలలుగా గ్లామర్ షో చేస్తూ తన ప్రత్యేక ఫోటో షూట్ల తో అందరికీ షాక్ ఇస్తోంది మీరా జాస్మిన్. ఇక అప్పటినుంచి ఈమె త్వరలోనే మళ్లీ టాలీవుడ్ లో అడుగు పెట్టడానికి ప్లాన్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులు కూడా మీరా జాస్మిన్ ను మళ్ళీ తెలుగు తెరపై చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

త్వరలోనే తెలుగులో "విమానం" అనే సినిమాతో మీరా జాస్మిన్ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా ఆమె పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర బృందం సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాలో సముద్రఖని, కీలక పాత్రలో కనిపించనున్నారు. జి స్టూడియోస్ మరియు కిరణ్ కొర్ర పార్టీ క్రియేటివ్ వర్క్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story