PSPK28 Movie Poster :"జాతర షురూ" అంటున్న పవర్ స్టార్ దర్శకుడు

admin1
Updated on: 3 Sept 2021 2:00 PM IST
Pawan Kalyan Harish Shankar PSPK28 Movie Concept Poster Released
X

PSPK28 Movie Concept Poster - (Image Source: The Hans India)

PSPK28 Movie Poster: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ అభిమానులకు వరుస కానుకలు లభిస్తున్నాయి. ఉదయం పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా అయిన "భీమ్లా నాయక్" నుంచి టైటిల్ సాంగ్ విడుదల కాగా మధ్యాహ్నం "హరిహర వీరమల్లు" పోస్టర్ తో పాటు విడుదల తేదీని ప్రకటించారు దర్శకనిర్మాతలు. ఏప్రిల్ 29 2022 "హరిహర వీరమల్లు" థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉండబోతోందని, ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్మెంట్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని అధికారిక ప్రకటన విడుదలైంది. తనకు "గబ్బర్ సింగ్" వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ విడుదలైంది. చిత్ర పోస్టర్ను విడుదల చేసిన దర్శక నిర్మాతలు పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపగా, "జాతర షురూ" అంటూ హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సారి యాక్షన్ మరియు ఎంటర్టెన్మెంట్ డబల్ డోస్ లో ఉంటాయని ఈ పోస్టర్ తో చెప్పకనే చెబుతున్నారు. హార్లే డేవిడ్ సన్ బైక్ మీద పవన్ కళ్యాణ్ మొహం చూపించకుండా పోస్టర్ ను స్టైలిష్ గా డిజైన్ చేశారు. అయితే పోస్టర్ చూస్తే మాత్రం కచ్చితంగా అభిమానులకు గబ్బర్ సింగ్ సినిమా గుర్తొస్తుంది. ఈసారి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు క్యాప్షన్ కూడా ఉండడంతో సబ్జెక్ట్ సీరియస్ గా ఉండబోతోందని కొందరు భావిస్తున్నారు.

admin1

admin1

Next Story