Pavan Kalyan: పవన్... హరీష్ శంకర్ సినిమా టైటిల్ ఇదేనంట?

Pavan Kalyan: పవన్… హరీష్ శంకర్ సినిమాకు టైటిల్ ''స్టేట్ కి ఒక్కడు'' అని టాలీవుడ్ టాక్?

Sandeep Eggoju
Updated on: 12 Jun 2021 11:56 AM IST
Pawan Kalyan Harish Shankar Film Comes With Super Mass Title
X

Pavan Kalyan & Harish Shankar (file image)

Pavan Kalyan: గబ్బర్ సింగ్ లాంటి కమ్ బ్యాక్ మూవీని పవన్ కు అందించిన హరీష్ శంకర్.. ఈసారి కూడా మాంచి మాస్ స్క్రిప్ట్ ని రెడీ చేశారనే టాక్ వినపడుతోంది. ఇప్పటికే వరస సినిమాలతో కేక పుట్టిస్తున్న పవన్ కల్యాణ్.. ఎంచుకుంటున్న సబ్జెక్టులు కూడా క్రేజీగా ఉంటున్నాయి. లెక్చరర్ పాత్రలో పవన్ ను హరీష్ చూపించనున్నాడట. ఈ సినిమాకు టైటిల్ ''స్టేట్ కి ఒక్కడు'' అని వినపడుతోంది. పక్కా మాస్ టైటిల్ గా అనిపించడంతో సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది.

ఇక తాజాగా మరో టైటిల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ ఊరమాస్ టైటిల్ ఈ చిత్రానికి ఫిక్స్ అయ్యినట్టుగా మరో టాక్ వైరల్ అవుతుంది. అదే "స్టేట్ కి ఒక్కడు" అనే టైటిల్. మరి ఈ విషయంలో ఏ మాత్రం నిజం ఉందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో ఈ టైటిల్ తెగ వైరల్‌గా మారింది. ఈ సినిమాను మైత్రీ మూవీస్‌ నిర్మిస్తోంది. స్క్రిప్టు పనులను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్టు నుంచి షూటింగ్ జరుపుకోవాలనీ చూస్తోందట.

ఇంకోవైపు పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఏ ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నదని టాక్.

ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంవత్సరం అంటే 2022 సంక్రాంతికి విడుదల కానుంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా సాగుతూ.. రాబిన్ హుడ్ తరహాలో ఉన్నవారిని కొట్టి, పేద వారికి అండగా ఉంటాడట హీరో. అందులో భాగంగా ఈ సినిమాలో హీరో పవన్ బందిపోటు పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story