హరిహర వీరమల్లు టీజర్ ఇప్పట్లో విడుదల అవ్వదా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా టీజర్ అప్పుడేనా?

Jyothi
Updated on: 29 Jan 2023 9:00 PM IST
Pawan Kalyan Hari Hara Veera Mallu Movie Updates
X

హరిహర వీరమల్లు టీజర్ ఇప్పట్లో విడుదల అవ్వదా?

Pawan Kalyan: ఈ మధ్యనే "భీమ్లా నాయక్" సినిమాతో మంచి హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో "హరి హర వీర మల్లు" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2020 సెప్టెంబర్ లో మొదలైంది. 2022 లో విడుదల కావాల్సింది కానీ ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. కనీసం సినిమా షూటింగ్ కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇక ఈ మధ్యనే "హరి హర వీర మల్లు" సినిమా షూటింగ్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ షూటింగ్ ను మళ్ళీ పట్టాలు ఎక్కించారు.

అదే సినిమా షూటింగ్ ఎలానో జరుగుతూనే ఉంది కాబట్టి సినిమాకి సంబంధించిన టీజర్ అయిన విడుదల చేస్తే బాగుంటుందని అభిమానులు అనుకున్నారు.. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే సినిమా టీజర్ ఇప్పటికి విడుదల కాదట. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత మాత్రమే సినిమా టీజర్ ను విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకుందట. అయితే ఇప్పటికీ కేవలం 60 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయింది.

ఇంకా సినిమా టాకీ పార్ట్ లో 40 శాతం మరియు రెండు పాటల షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఇక మే కల్లా సినిమా షూటింగ్ పూర్తి చేసి జూన్లో సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏ ఎం రత్నం ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story