Hari Hara Veera Mallu: పవన్ పుట్టినరోజు కానుకగా హరిహర వీరమల్లు అప్డేట్

* ఆసక్తికరమైన అప్డేట్ తో హరిహర వీరమల్లు

Sandeep Reddy
Updated on: 2 Sept 2021 3:07 PM IST
Pawan Kalyan Hari Hara Veera Mallu Movie Team Tweets The Release Date Poster on  02 09 2021
X

పవన్ కళ్యాణ్ (ట్విట్టర్ ఫోటో)

Hari Hara Veera Mallu Release Date Poster : ఈ మధ్యనే "వకీల్ సాబ్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇప్పుడు "భీమ్లా నాయక్" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ మరియు క్రిష్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోంది. పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా కి "హరిహర వీరమల్లు" అనే టైటిల్ ను ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు మరియు టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి.


Hari Hara Veera Mallu Release Date Poster

ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఇవాళ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు ఒక ఆసక్తికరమైన అప్డేట్ ను విడుదల చేశారు. ఒక అద్భుతమైన పోస్టర్ తో పాటు చిత్రం విడుదల తేదీని ప్రకటించారు దర్శకనిర్మాతలు. పోస్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిత్రబృందం ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 29 విడుదల కాబోతున్నట్లు స్పష్టం చేశారు.

నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story