దశాబ్దాల కోరిక నెరవేరిన రోజు: పవన్‌ కల్యాణ్

దశాబ్దాల కోరిక నెరవేరిన రోజు: పవన్‌ కల్యాణ్
x
Highlights

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు...

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు చారిత్రాత్మకమైనది. కోట్లాది మంది కల సాకరమైన రోజు. దశాబ్దాల కోరిక నెరవేరిన రోజు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ జన్మించిన రోజు. వేలాది మంది బలిదానాలు, కోట్లాది మంది త్యాగాల ఫలం మన తెలంగాణ. తెలంగాణ సాధనలో ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు అంజలి ఘటిస్తున్నా.

ఈ మహత్కార్యం సాకారం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ జేజేలు పలుకుతున్నాను, అభివృద్ది ఫలాలు అందరికి అందించవల్సిన బాధ్యత ప్రభుత్వాలను నడిపే నేతలు,ప్రజా ప్రతినిధులు, రాజకీయ పక్షాలపై ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం దినదిన ప్రవర్థమానం అవ్వాలని,అభివృద్ధిలో తిరుగులేని శక్తిగా నిలవాలని కోరుకుంటున్నాను అని పవన్‌ ప్రకటన విడుదల చేశారు.



HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Show Full Article
Print Article
More On
Next Story
More Stories